గత మూడు నెలల నుండి ఇంటికే పరిమితమైన క్రికెటర్లు అందరూ మళ్లీ ప్రాక్టీస్ లోకి వెళ్ళి పోతున్నారు. ఆటగాళ్ళందరూ కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు క్యాంపులో ప్రాక్టీస్ చేయాలని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. ఈ నెల చివరిలో లాక్ డౌన్ ముగియడంతో ఆటగాళ్లందరికి ప్రాక్టీస్ మొదలు అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని మైదానంలోకి అడుగు పెడదామా అని ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా మహమ్మద్ షమీ ఇలాంటి సమయంలో బాగా శ్రమించి మెరుగైన ఫిట్నెస్ ను సాధించాడని తెలిపాడు.


ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడా అని మైదానంలోకి వస్తారా అని ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి తోడు వచ్చే నెల మొదటి వారంలో క్రికెటర్లందరికీ ఆరు నుంచి ఎనిమిది వారాల కాంపు నిర్వహించాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. అందులో రన్నింగ్, యోగ, ఫిట్ నెస్ కు సంబంధించిన కొన్ని రెండు మూడు పరీక్షలు నిర్వహించబోతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈ టెస్టు మరింత కఠినంగా ఉండబోతున్నాయని భరత్ అరుణ్ తెలియజేశారు.

 


అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవ్వాలి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో అది వాయిదా పడుతూనే వస్తుంది ఇంకా ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో పూర్తి అంచనా లేదు. లాక్ డౌన్ సమయంలో ఆటగాళ్ళందరూ వారికి అనుకూలంగా ఉన్న చోట వ్యాయామాలు చేస్తూ వారి ఫిట్నెస్ ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే కొందరి ప్లేయర్ లకు అపార్ట్మెంట్లో ఉండిపోవడంతో వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఇన్నాళ్ళు ఇంట్లో ఉంది హాయిగా గడిపేసిన ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు మైదానంలోకి వచ్చి ఆడాలని ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: