క్రికెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఇష్టపడతారో అందరికీ తెలిసిందే. అయితే క్రికెట్ దేవుడు ఎవరంటే వెంటనే సచిన్ టెండూల్కర్ అని చెబుతారు. చిన్న వయసులో రికార్డు మోత మోగిస్తూ ప్రత్యర్థి దేశమైన పాక్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టిన ఘన సచిన్ కే చెల్లుతుంది. క్రికెట్ మైదానంలో ఎన్ని దేశాల టీమ్ లు తలపడుతున్నారు.. భారత్ - పాక్ మద్య వచ్చే ఆటంటేనే ప్రపంచ క్రికెట్ అభిమానులు పిచ్చిగా చూస్తుంటారు.  ఈ ఆటగాళ్ల మద్యసాగే ఆటను చూసి కోట్ల పందాలు కూడా నడుస్తుంటాయి.  మైదానంలో ప్రత్యేర్థులైనా బయట మాత్రం స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటారు.  సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే.. అతన్ని ఔట్ చేస్తే వచ్చే ఫలింగ్ అంతా ఇంతా కాదంటారు బౌలర్లు.  అయితే, 2003 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, సచిన్ విశ్వరూపం ప్రదర్శించి 98 పరుగులు చేశాడు.

 

సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ను అవుట్ చేసింది ఎవరో కాదు, భీకరమైన వేగానికి ప్రతిరూపంలా నిలిచే షోయబ్ అక్తర్. అప్పట్లో మనోడి బౌలింగ్ సూపర్ స్పీడ్ గా ఉండేది.. అంతే కాదు బౌలింగ్ వేసే సమయంలో కూడా అక్తర్ చాలా సీరియస్ గా ఆవేశంగా ఉండేవాడని అంటుంటారు.  అయితే, నాడు సచిన్ ను అవుట్ చేసిన తర్వాత సంతోషం కలగలేదని, ఎంతో బాధపడ్డానని అక్తర్ తాజాగా వెల్లడించాడు. సెంచరీకి చేరువైన సచిన్ ను అవుట్ చేయడం వ్యక్తిగతంగా తనకు ఎంతో వేదన కలిగించిందని అన్నాడు. 

 

ఈ మద్య వరుస ఇంటర్వ్యూలో ఇస్తున్న అక్తర్ గతంలో తన జీవితంలో జరిగిన విషయాలు ప్రస్తావిస్తున్నారు.  వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ చేయడం అనేది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని, కానీ సచిన్ కు ప్రత్యేక ఇన్నింగ్స్ ను తానే దూరం చేశానని, సచిన్ సెంచరీ పూర్తిచేయాలని కోరుకున్నానని అక్తర్ వివరించాడు.  అయితే ఆ బంతికి సచిన్ సిక్సర్ కొడితే ఎంతో సంతోషించేవాడ్నని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: