డేవిడ్ వార్నర్... ప్రస్తుతం ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేక్షకుడు, అలాగే తెలుగు సినీ అభిమాని ఉండడు. దీనికి కారణం ఆయన గత కొద్ది రోజులుగా తెలుగులోని వివిధ హీరోలు నటించిన పాటలకు సినిమా డైలాగులకు టిక్ టాక్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా అలరిస్తున్నాడు. ఇదంతా ఇలా ఉండగా నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా... డేవిడ్ వార్నర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజంగా ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ ను తెగ పొగిడేస్తూ కామెంట్ల వర్షాన్ని కురిపించారు. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి.. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో " నేను పక్క లోకల్ " అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. అయితే డేవిడ్ వార్నర్ గురించి మీకు కొన్ని తెలియని సంఘటనలు చూస్తారా...!

 


125 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే డైరెక్టుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడిన వ్యక్తిగా డేవిడ్ వార్నర్ రికార్డులకెక్కాడు. డేవిడ్ వార్నర్ తన క్రికెట్ ప్రస్థానాన్ని 2009 సంవత్సరంలో మొదలు పెట్టాడు. తను ఆడిన మొదటి మ్యాచ్లోనే కేవలం 43 బంతుల్లో 88 పరుగులు (7 ఫోర్లు, 6 సిక్స్ లు) చేసి తన సత్తా ఏమిటో ప్రపంచానికి మొదటి రోజే చాటిచెప్పాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తరపున తన 100 వన్డేలో వంద పరుగులు చేసిన మొదటి ఆటగాడు అతనే. అయితే ప్రపంచంలో అతను ఎనిమిదవ ఆటగాడు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy birthday @jrntr have a great day. We tried but wow the dance is fast 😂😂 @candywarner1 #jrntr #birthday #fun #dance

A post shared by David Warner (@davidwarner31) on


అంతేకాకుండా డేవిడ్ వార్నర్ 2015 నుంచి 2018 వరకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే 2018 సంవత్సరంలో జరిగిన బాల్ టాంపరింగ్ విషయంలో కెప్టెన్ స్మిత్ తో పాటు, డేవిడ్ వార్నర్ కూడా సంవత్సరంపాటు అన్ని క్రికెట్ ఫార్మేట్ లలో ఆడకుండా ఆయనకు నిషేధం విధించారు. అయితే 2019లో మళ్లీ తను గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. 2019 సంవత్సరం నవంబర్ లో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 335 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న విషయం మనందరికీ విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: