భారత క్రికెట్ అభిమానులకు మరో చేదు ఈ విషయాన్ని తెలిపింది బీసీసీఐ. వర్షాకాలం తర్వాత దేశంలో మళ్లీ క్రికెట్ టోర్నీ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్ 2020 సీజన్ కూడా జరిగే అవకాశాలు లేవని ఆయన తెలపడం జరిగింది. దీనికి కారణం కేవలం కరోనా వైరస్ మాత్రమే.

 

కరోనా వైరస్ ఆంక్షల వల్ల క్రికెటర్ ప్రపంచం మొత్తం రద్దయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే రాహుల్ వెబ్ నార్ సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరు తమ భద్రత ఆలోచిస్తున్నారని వారిని గౌరవించాలని ఆయన తెలిపారు. నిజానికి బీసీసీఐ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు ఆయన ఈ విధంగా తెలియజేశారు.

 


అయితే వర్షాకాలం ముగిసిన తర్వాతే క్రికెట్ అధికారంగా మొదలయ్యే సూచనలు కనపడుతున్నట్లు రాహుల్ తెలియజేశారు. జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు భారతదేశంలో వర్షాకాలం కారణంగా ఒకవేళ మ్యాచ్లు జరిగిన వర్షంతో రద్దవుతాయి ఉద్దేశంతో డైరెక్టుగా వర్షాకాలం తర్వాతనే మ్యాచ్లు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఒకవేళ ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం జరగవలసిన టి20 వరల్డ్ కప్ వాయిదా పడితే కనుక అప్పుడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. 

 


ఈ విషయంలో ముఖ్యంగా ఐపీఎల్ ఆడడానికి అనేక దేశాల అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లందరూ వస్తుంటారని వారికి 14 అవసరం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలంటే చాలా కష్టమని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు మ్యాచ్ మ్యాచ్ కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పరిస్థితి కుదరదు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాహుల్ సూచనగా తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: