కరోనా వల్ల గత రెండు నెలలనుండి క్రికెట్ స్థంబించిపోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు అన్ని దేశాల బోర్డులు భారీ నష్టాలను చవిచూశాయి అయితే మళ్ళీ ఇప్పుడప్పుడే క్రికెట్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఇదిలావుంటే మార్చి లో ఇండియా తో మూడు వన్డేల్లో తలపడానికి భారత గడ్డపై అడుగుపెట్టిన సౌతాఫ్రికా కరోనా వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశానికి వెళ్ళిపోయింది. ఈసిరీస్ ను ఈఏడాది చివర్లో నిర్వహించే అవకాశాలు వున్నాయి
 
అయితే అంతకంటే ముందు ఆగస్టు లో ఇండియా తో మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో తలపడేందుకు క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ తో చర్చలు జరుపుతుంది.  ఈవిషయాన్ని సీఎస్ఏ సభ్యుడు జాక్వస్ ఫాల్  వెల్లడించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా బోర్డు డైరెక్టర్  గ్రేమ్ స్మిత్  అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ ఈ విషయం గురించి చర్చిస్తున్నారని అన్నికుదిరితే ఆగస్టు లో ఇరు జట్ల మధ్య మూడు టీ 20ల సిరీస్ జరుగుతుందని ఆయన అన్నారు.
 
ఇదిలావుంటే కరోనా వల్ల  ఈ ఏడాది ఐపీఎల్  నిరవధిక వాయిదా పడగ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈమేరకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. వర్షాకాలం తరువాత ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయని జోహ్రి అన్నారు. ఒకవేళ ఐపీఎల్ ను నిర్వించాలనుకున్న కూడా ప్రేక్షకుల మధ్యన కాకుండా ఖాళీ  స్టేడియాల్లో జరిపేందుకే బీసీసీఐ మొగ్గు చూపనుంది. ఇక  మార్చి 29న స్టార్ట్ కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ఏప్రిల్ 14వరకు వాయిదా పడింది. ఆతరువాత కూడా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఇటీవల   బీసీసీఐ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: