ఈ సంవత్సరం చివరిలో నాలుగు టెస్టుల సిరీస్ ల భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ నేపథ్యంలో క్రికెట్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ప్రపంచంలోని అనేక క్రికెట్ బోర్డుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అందులో క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి కూడా చాలా ఘోరంగా తయారైంది.


ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సంవత్సరం చివర్లో టీం ఇండియాతో నిర్వహించాల్సిన టెస్టు సిరీస్, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు చాలా కీలకంగా మారింది. ఇకపోతే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ ఒక మీడియాతో మాట్లాడుతూ... టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన పై తను స్పందించాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము అని అయితే దాదాపు టీమిండియా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆ సందర్భంగా తెలియజేశారు.

 

అయితే టీమ్ ఇండియా ఆసీస్ తో ఆడకపోతే మాత్రం మేము ఆశ్చర్యపోతాం అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇక అలాగే ఆదేశంలోని ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ... కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఎలా వస్తారని కెవిన్ తెలిపారు. ఇప్పుడు ఎలా ఉన్నా అప్పటికి ఏం జరుగుతుందో అందరూ వేచి చూడాలని ఆయన తెలిపాడు. లేకపోతే ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ పర్యటన పై కూడా కెవిన్ స్పందించాడు. ఆ విషయంలో తాము వేచి చూసి సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపాడు. ఇకపోతే ఆస్ట్రేలియా ఆ సీరీస్ కంటే ముందు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు ఇంగ్లాండ్ లో పర్యటన చేయవలసి ఉందని వాళ్లను చూసి క్రికెట్ ఆస్ట్రేలియా అడుగులు ముందుకు వేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా మేము ఆటగాళ్ల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపాడు. ఎలాంటి అడ్డంకులు లేకపోతేనే ఆస్ట్రేలియా ఆటగాళ్లను వేరే దేశాలకు పంపించి క్రికెట్ అందిస్తామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: