ప్రస్తుతం ఎప్పుడు  బిజీగా ఉండే  క్రికెటర్లు అందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ అయినా మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న అనుభవాలను ఆటగాళ్లందరూ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సురేష్ రైనా ధోనీ తో తనకున్న అనుభవాన్ని అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి కెప్టెన్సీ ఎంతో భిన్నంగా ఉంటుంది అంటూ తెలిపాడు. అసలు పోలికలు లేవు అంటూ వ్యాఖ్యానించారు. అయితే రోహిత్  శర్మ  కెప్టెన్సీ  ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అంటూ సురేష్ రైనా కితాబిచ్చాడు. 

 

 ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సి  ధోనీ కెప్టెన్సీని పోలి ఉంటుంది అంటూ తెలిపాడు. మైదానంలో ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండకుండా ఎప్పుడు ఖామ్ అండ్ కూల్ గా తన పని తాను చెసుకుంటూ పోతాడని.... అచ్చం ధోనీ లాగానే మైదానంలో ఆలోచిస్తూ ఉంటాడు అంటూ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు సురేష్ రైనా. ఆటగాళ్లకు సూచనలు ఇచ్చే సమయంలో అయినా.. బ్యాటింగ్ చేసే సమయంలో అయినా ఆటగాళ్లకు సూచనలు సలహాలు ఇస్తు ఎంతో కూల్గా ఉంటాడు అని తెలిపారు. ఎప్పుడు ఏం చేయాలి అన్నది రోహిత్ శర్మ ఖచ్చితత్వంతో ఉంటాడని  సురేష్ రైనా తెలిపాడు. 

 

 ఈ సందర్భంగా ధోనీ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడారు సురేష్ రైనా. ధోనీ కెప్టెన్సీలో బ్యాటింగ్ ఆర్డర్  ఎంతో భిన్నంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. మ్యాచ్  పరిస్థితులనుబట్టి ధోని బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు అంటూ ఆయన తెలిపారు. ప్రత్యర్థి జట్లు ఎలా అంచనా వేస్తున్నాయి పిచ్ స్వభావం ఎలా ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్ను ధోనీ మారుస్తూ ఉంటాడు  అని చెప్పుకొచ్చాడు సురేష్ రైనా. అలా  తన బ్యాటింగ్ ఆర్డర్ను ఎన్నో సార్లు ధోనీ మారుస్తూ వచ్చాడని... కానీ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్పు ఎందుకు చేసావ్ అంటూ ఎప్పుడూ నేను అడగలేదు అంటూ చెప్పుకొచ్చారు. ధోనీ ఏ సమయంలో అయిన  అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాడని . వికెట్ల వెనకాల ఉండి గేమ్ మొత్తం చదివేస్తు  ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు రైనా .

మరింత సమాచారం తెలుసుకోండి: