కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో కీలక టోర్నీలు  సైతం నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే క్రికెట్ ఆటగాళ్లందరూ ప్రస్తుతం హాయిగా ఫ్యామిలీతో  ఇంట్లో సమయం గడుపుతున్నారు. అయితే క్రికెట్ ఆటగాళ్లు అందరికీ ఇంత ఎక్కువ సమయం విరామం రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. దాదాపుగా 50 రోజులకు పైగా ప్రస్తుతం క్రికెట్ ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ పోటీలను ప్రారంభించ్చేందుకు  తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికే ఐసీసీ అన్ని  దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 


 అయితే కరోనా నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న అలవాట్లు ప్రస్తుతం కొన్ని మారే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ నియమాలులో ఎలాంటి రూల్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి తాజాగా ఐసీసీ  పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందులో ఆటగాళ్లకు ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మార్గదర్శకాలను సూచించింది ఐసీసీ. ఇందులో బంతి పై లాలాజలం తో రుద్దడం పై నిషేధం విధించింది... అంతేకాకుండా  తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం... శానిటైజర్ లు విధిగా ఉపయోగించడం.. కళ్ళు ముక్కు నోరును చేతితో తాకకుండా జాగ్రత్త పడాలని సూచించింది. 

 


 దగ్గు తుమ్ము వచ్చిన సమయంలో అరచేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టికోవాలంటూ సూచించింది. శీతల పానీయాలు కానీ టవళ్లు  కానీ ఒకరివి మరొకరు వాడకూడదు అంటూ తెలిపింది. ఇక వికెట్ పడినప్పుడు ఆటగాళ్ళు అందరు  దగ్గరికి వచ్చి  గుమిగూడి అభినందించడం లాంటివి చేయకూడదు అని తెలిపింది. అభినందించేందుకు కౌగిలింతలు చేతులు కలపడం లాంటివి చేయకూడదు అంటూ తెలిపింది. ఇక ఆటగాళ్లందరూ ఫిట్నెస్ కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సాధ్యమైనంత వరకూ ఆటగాళ్లు మైదానంలో డ్రెస్సింగ్ రూమ్ లో  భౌతిక దూరం తప్పక పాటించాలి అంటూ సూచించింది. విదేశీ పర్యటనల సమయంలో కనీసం రెండు వారాల విధిగా క్వారంటైన్  పాటించాలి అంటూ తెలిపింది. ఇక ప్రతి జట్టు యాజమాన్యం తమ జట్టుకి  ఒక ప్రత్యేక వైద్యుడిని నియమించాలని... ఆ వైద్యుడు ఎప్పుడూ ఆ జట్టుతో ఉండాలి అంటూ తెలిపింది. ఎందుకంటే క్రికెటర్లకు సాధ్యమైనన్ని సార్లు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుపుతూనే ఉండాలి అంటూ తెలిపింది. ఇలా కొత్త నిబంధనలతో ఐసీసీ  పలు మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: