టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కసారి మైదానంలోకి దిగే బ్యాట్ జులిపించాడు  అంటే  బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే అన్న విషయం తెలిసిందే. మైదానం ఏదైనా బౌలర్ ఎవరైనా వీర విహారం చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరి తరమూ కాదు. డబుల్ సెంచరీలు చేయడంతో రోహిత్ శర్మ తనకు తానే సాటి. అలవోకగా భారీ సిక్సర్లు కొట్టడం.... అదిరిపోయే షాట్లతో  బౌండరీలు సాధించడం రోహిత్ శర్మ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే రోహిత్ శర్మ టీమిండియా విజయంలో ఎప్పుడూ కీలకం గా మారిపోతూ ఉంటాడు. ప్రేక్షకులందరూ రోహిత్ శర్మ ను హిట్ మ్యాన్ అనే  పేరుతో పిలుస్తారు. ఫార్మాట్ ఏదైనా రోహిత్ శర్మ తనదైనా శైలిలో ఆటను  కొనసాగిస్తూ ఉంటాడు. 

 


 మామూలుగా ఆటగాళ్లకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి అనే విషయం తెలిసిందే. అలాగే రోహిత్ శర్మ కూడా కొన్ని సెంటిమెంట్లు  ఉన్నాయి. అవేంటంటే... రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కూ  ముందు కాఫీ కచ్చితంగా తాగుతాడు. కాఫీ తాగడం కారణంగా ఒత్తిడి తగ్గి తనకు మానసిక బలం చేకూరుతుందని రోహిత్ శర్మ నమ్ముతాడు. అంతే కాకుండా మ్యాచ్ కి వెళ్లేముందు ఖచ్చితంగా తన భార్య రితిక ను పిలుస్తాడు రోహిత్ శర్మ. ప్రతి మ్యాచ్ కూ  ముందు ఇలా చేయడం రోహిత్ శర్మ కు అలవాటు. ఇక మైదానంలోకి అడుగు పెట్టే ముందు రోహిత్ శర్మ తన కుడి కాలు మైదానంలో ముందుగా అడుగు పెడతాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన భార్య రితిక తన రెండు చేతుల వేళ్లను పట్టి ఉంచుతుంది. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఆ వేళ్ళను తెరుస్తుంది రితిక. 

 

 ఇలా టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో ఇలాంటి నమ్మకాలను పాటిస్తూ ఉంటాడట. అంతేకాదు రోహిత్ శర్మ తన భార్య రితిక ను ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే 2015 డిసెంబర్ లో రోహిత్ శర్మ వివాహం జరిగినప్పటినుంచి రోహిత్ శర్మ కెరియర్ ఎంతగానో మెరుగుపడితూ  వచ్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు రోహిత్ శర్మ. అధికంగా సెంచరీల వర్షం కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోయాడు రోహిత్ శర్మ. అందుకేనేమో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసినప్పుడల్లా తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని ముద్దు పెడుతూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: