టీమిండియా క్రికెట్ జట్టులో స్ల్పిట్ కెప్టెన్సీ విధానం ఉండాలని భారత మాజీ పేసర్ అతుల్ వాస‌న్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. స్ల్పిట్ కెప్టెన్సీ  విధానం అంటే వివిధ ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్లు ఉండటం చాలా మంచిది అని తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం మన ఇండియా టీంకు మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అలాగే టెస్టులు, వన్డేలలో కూడా కెప్టెన్గా కోహ్లీ కొనసాగిస్తూ, పొట్టి  క్రికెట్ లో మాత్రం రోహిత్ శర్మ కు కెప్టెన్సీ నాయకత్వాలు అప్పగిస్తే బాగుంటుంది అని ఆయన తెలియచేయడం జరిగింది. అలాగే ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ పై ఒత్తిడి తగ్గి పని భారం కూడా తగ్గుతుంది అని వివరించడం జరిగింది. 

 

ఇక వాస్తవానికి గత రెండు సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల టి 20 క్రికెట్ ఫార్మాట్లో కోహ్లీ కన్నా ఎక్కువగా రోహిత్ శర్మ ఏ జట్టుకు నాయకత్వం వహించడం జరుగుతుంది.
అంతేకాకుండా టి20 సిరీస్ లో రోహిత్ శర్మ కు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది అనే చెప్పాలి. రోహిత్ 19 మ్యాచ్లలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ... 15 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకున్నాడు. ఇక మరోవైపు కోహ్లీ 37 టి-20 మ్యాచ్ లో చెట్టుకు కెప్టెన్ గా ఉండగా 22 మ్యాచ్లలో గెలుపును సొంతం చేసుకున్నాడు.

 

గత కొంతకాలంగా కోహ్లీ టీ20 ఆడకుండా ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజానికి 2017 లోని ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న గా అప్పట్లో ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు కాస్త వెనకడుగు వేశారు అనే చెప్పాలి.  రెండు సంవత్సరాలుగా టి20 వరల్డ్ కప్ లో రోహిత్ కు సునీల్ జోషీ నేతృత్వంలో ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఏ విధమైన డెసిషన్ తీసుకుంటుందో వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: