ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రపంచ నలుమూలల క్రీడారంగం పూర్తిగా స్తంభించింది. దీనితో పెద్ద పెద్ద టోర్నీలు కూడా కొన్ని రద్దు అవ్వగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. మన భారతదేశంలో జరగవలసిన ఐపిఎల్ కూడా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే....


ఒక వేళ కరుణ ప్రభావం తగ్గాక కాళీ స్టేడియంలో మ్యాచ్ లు కొనసాగితే ఆటగాళ్లు అందరూ ప్రేక్షకులు ముందు ఆడే మంచి అనుభూతిని మిస్ అవుతామని టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఆటకు అభిమానులు కొత్త ఉత్తేజాన్ని తీసుకు వస్తారని ఆయన తెలిపాడు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ కెప్టెన్ అంజెలో మ్యాథ్యూస్ తో జరిపిన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ధావన్ ఈ విషయాన్ని తెలిపాడు.

IHG


ఒకవేళ కాళీ స్టేడియాలలో పోటీలు జరిగితే మాత్రం మనం ఖచ్చితంగా ప్రేక్షకుల సమక్షంలో ఆడే అనుభూతిని ఆటగాళ్లందరూ మిస్ అవుతారు అని తెలిపాడు. నిజానికి ప్రేక్షకులు ఇచ్చే ఉత్తేజంతో అదో శక్తిలా మనకు ఉంటుందని శిఖర్ ధావన్ తెలిపాడు. అయితే గత మూడు నెలల నుంచి ఇంట్లో కూర్చున్న మనం మళ్లీ ఆడేందుకు ఏదో విధంగా క్రీడారంగం మొదలవుతే బాగుంటుందని ఆయన తెలిపాడు. అయితే ఇప్పటికే ఆటగాళ్లందరూ ఆట కోసం ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఒక్కసారి బరిలోకి దిగితే మనం వారివారి జట్ల కోసం కచ్చితంగా దుమ్ము లేపుతామని, అది చాలా సరదాగా ఉంటుందని తెలిపాడు.

 

 

మొత్తంగా ఆట ఆడడం అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తుందని దానిని నేను చాలా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తున్నా అని తెలిపాడు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డా ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్పకనే చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: