ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలుసిందే . ఈ నేపథ్యంలో  సోషల్ మీడియా వేదికగా అభిమనులతో  చిట్ చాట్ చేస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఇక తాజాగా టీమిండియా యువ సంచలనం పృద్వి షా  సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన స్నేహితులతో ఇంస్టాగ్రామ్ వేదిక లైవ్ చాట్ లో పాల్గొన్న పృద్వి షా తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

 


 తనకు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు తొలిసారిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కలిసానని చెప్పిన పృద్వి షా ... సచిన్ ని కలిసిన నాటి నుంచి సచిన్  సర్ ను  తన మెంటర్ గా  భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. క్రికెట్ విషయంలో ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారని ... వ్యక్తిగత విషయాలతో పాటు మానసికంగా ఎలా మెలగాలి అన్న విషయాలపై  ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు పృద్వి షా . ఇక తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. 

 

 ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... తనకు టీమిండియా యువ ఆటగాడు అయిన పృద్వి షా తో  చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది అని పేర్కొన్నాడు. పృద్వి షా ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు అంటూ తెలిపిన సచిన్ టెండూల్కర్... అతనికి సహాయం చేయడాన్ని ఎంతో సంతోషంగా పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.కాగా  2018 అక్టోబర్ లో వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భారత జట్టు లోకి అరంగేట్రం చేసిన పృద్వి షా  ఎన్నో మ్యాచ్ లలో  అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి చూపులు ఆకర్షించాడు. మొదటి టెస్టులోనే సెంచరీ తో చెలరేగి సృష్టించాడు పృథ్వీ షా..

మరింత సమాచారం తెలుసుకోండి: