ఐపీఎల్ 2020 సీజన్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో విజేతగా నిలిచింది. సోమవారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో RCB భారీ విజయం సొంతం చేసుకొని కప్ ను కైవసం చేసుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అభిమానులకు ఆనందం అవధులు లేకుండా పోయింది. ఏంటి ఇదంతా ఏమైనా కల అని అనుకుంటున్నారా...? కానే  కాదండి ఇది నిజంగా నిజం. 2020 ఐపీఎల్ సీజన్ ను RCB గెలిచింది.

 


అసలు ఐపీఎల్ ఎప్పుడు మొదలైంది...?  ఎప్పుడు RCB గెలిచింది ...? అని అనుకుంటున్నారు కదా...! నిజానికి ఒక్క ఫోర్ కొట్టలేదు, ఒక పరుగు తీయలేదు, ఒక బాల్ వేయలేదు... కానీ RCB ఫైనల్లో గెలిచి ఐపీఎల్ కప్ ను గెలిచింది. అయితే ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదండి. ఇండియన్ పోల్ లీగ్ లో...! అవును నిజమే లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడుతుండడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కొత్తగా ఆలోచించింది.


ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోజువారి మ్యాచ్ కు సంబంధించి ప్రతిరోజు పోల్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అత్యధిక ఓట్లు సాధించిన జట్టు ఆ మ్యాచ్లో గెలిచినట్లు. అయితే ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ లో నిర్వహించడం పూర్తిగా అయిపోవడంతో చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వీటిలో ఫైనల్ పోరుకు సిద్ధం అయ్యాయి. ఇకపోతే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏకంగా 85 శాతం ఓట్లు పడడంతో ఆ జట్టును విజేతగా ప్రకటించింది. ఇకపై దీని మీద కొందరు నెటిజన్లతో సహా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు CSK ట్విట్టర్ వేదికగా స్పందించింది. 

అందులో " ఈ సాల కప్ నమ్ దే "... అని అనుకరిస్తూ ఈ ఏడాదీ కప్పు మీదే అంటూ CSK సరదాగా ట్వీట్ చేసింది. ఇలా అయినా కప్ గెలిచామని కొందరు RCB ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ఎంతో మంది ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఉన్న ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని కేవలం ఒక్కసారి మాత్రమే కైవసం చేసుకుంది. ఇకపోతే ఆస్ట్రేలియాలో అక్టోబర్ నెలలో జరగాల్సిన ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: