ఆ నలుగురు నుంచి అప్పు తీసుకోవాలని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. నిజానికి ప్రపంచ క్రికెట్లో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క ఆట తీరు చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా కొంత మంది మాత్రమే ఆడగల ఆటగా చూడవచ్చు. ఇకపోతే ఈ విషయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... కొంతమంది ఆటగాళ్ల యొక్క కొన్ని నైపుణ్యాలను నేను అప్పు గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. 

IHG


ఇక ఈ విషయం గురించి పూర్తిగా మాట్లాడితే... కేన్ విలియమ్సన్ మాట్లాడిన మొదటి ఆటగాడు మరెవరో కాదు, మన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నిజానికి విరాట్ కోహ్లీ విలియమ్సన్ అండర్ 19 నుంచి స్నేహితులు అని చెప్పవచ్చు. వీరిద్దరూ అండర్ 19 మ్యాచ్ లు ఆడినప్పుడు విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున, విరాట్ కోహ్లీ భారత్ తరుపున మ్యాచులు ఆడేవారు. ఇకపోతే విలియమ్సన్ మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్ పద్ధతిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దానికి కారణం విరాట్ కోహ్లీ ఎల్లప్పుడు పరుగులు చేయడంపై దృష్టి పెడతారని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ యువ సంచలనం ఆజం నుండి కవర్ ఆర్ డ్రైవ్స్, బ్యాక్ ఫుట్ పంచుల నైపుణ్యాన్ని, ఇక అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నుండి ఆటగాళ్ల మధ్య గ్యాప్ కనుక్కొని పరుగులు రాబట్టే నైపుణ్యాన్ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.


కాలాగే చివరగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ... ఆయన దగ్గర నుండి బ్యాక్ ఫుట్ ప్లే సామర్థ్యం ను పొందాలని, అది ఉంటే ఏ బ్యాట్స్మెన్ కు అయినా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది తీసుకోవాలని అనుకుంటున్నట్లు విలియమ్సన్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: