తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, శ్రీలంక స్టార్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర కలిసి ఇంస్టాగ్రామ్ లైవ్ లో సంభాషించారు. అయితే దాదాపు 28 సంవత్సరాల తర్వాత నిరీక్షణకు తెర దించుతూ 2011 సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ నో టీమిండియా మరోసారి ముద్దాడిన సంగతి అందరికీ విదితమే. అయితే వీరిద్దరి లైవ్ చాట్ లో ఆ మ్యాచ్ కు సంబంధించి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఫైనల్ నాడు ఆ రోజు మ్యాచ్ లో రెండుసార్లు టాస్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి గల కారణాలను వివరించాడు సంగక్కర.

 

అయితే ఆ విషయం మీద మాట్లాడుతూ... నేను ఎప్పుడూ శ్రీలంకలో అంత మంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదని తెలిపాడు. అంతమంది అభిమానులు మైదానానికి వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరిచే ఎందుకు అది భారత్ అయితేనే సాధ్యం అంటూ, కిక్కిరిసిన ప్రేక్షకులు... భారీ శబ్దాలు మధ్య మేము టాస్ వేయడానికి వెళ్ళాము. అయితే ఆనాడు మహేంద్ర సింగ్ ధోనీ టాస్ వేశాడు. అయితే నేను టైల్స్ అన్నాను కాకపోతే అది భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది అతనికి అసలు వినపడలేదు అన్నాడు. అయితే నన్ను అడిగాడు నువ్వు టైల్స్ ఆన్నావా...? అని, కాదు నేను టైల్స్ అని అన్నాను . దాన్నిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ రేంజ్ లో సౌండ్స్ ఉన్నాయన్నది. ఇకపోతే మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచింది అని చెప్పగా ధోనీ గందరగోళంగా ఉందని మరోసారి వేయాలని మహేంద్రసింగ్ ధోని రిఫరీ, నన్ను అడిగాడు. దీనితో మరోసారి టాస్ వేయాల్సి వచ్చిందని తెలిపాడు. 


ఇకపోతే మరోసారి టాస్ వేయడంతో మళ్లీ మేమే గెలిచామని, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించామని గెలిచాడు. బహుశా రెండోసారి మేము కనుక టాస్తే ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి ఉండేది. మేము లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళమేమో అని అన్నాడు. అంతేకాకుండా 5, 6 స్థానాలకు కారణంగా మా బ్యాటింగ్ చాలా దుర్భరంగా ఉంది. అప్పటికి మేము మా బ్యాటింగ్ శైలిలో అనేక మార్పులు ప్రయోగాలు చేసి సఫలీకృతం అయ్యారు. ఇక అంతే కాకుండా ఆ మ్యాచ్లో మ్యాథ్యూస్ గాయం కారణంగా కూడా మేము ఓటమికి కారణమైంది అని ఆయన తెలియజేశారు. అయితే టీమిండియా అద్భుతంగా పోరాడి ధోనీ తన స్టైల్ లో సిక్సర్ కొట్టి టీమ్ ఇండియా కు ప్రపంచ కప్పును అందించాడు అని ఆనాటి సంగతులను సంగక్కర తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: