కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి ప్రపంచం మొత్తం క్రీడారంగం స్తంభించిన సంగతి అందరికి తెలిసిన విషయం. ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియాలో కోహ్లీసేన పర్యటన షెడ్యూల్ పూర్తిగా ఖరారైపోయింది. కరోనా వైరస్ కారణంగా వారం రోజుల నుంచి సాగిన సందిగ్ధతకు పూర్తిగా తెరదించుతూ మొత్తానికి షెడ్యూల్ ను " క్రికెట్ ఆస్ట్రేలియా " బోర్డు ప్రకటించింది.


ఇందులో మొత్తం మూడు టి20 లు, నాలుగు టెస్ట్ లు, మూడు వన్డేల సిరీస్ లను గురువారం నాడు అధికారిక వెబ్ సైట్ ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇక షెడ్యూల్ విషయానికొస్తే ఆస్ట్రేలియాతో అక్టోబర్ 11వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టీ-20 తో ఆస్ట్రేలియా భారత్ తలబడ పోతున్నాయి. ఇకపోతే మూడో టి20 ముగిసిన తర్వాత రోజే టీ20 ప్రపంచకప్ మొదలవ్వాల్సి ఉంది. ఇక దీనితో ప్రపంచ కప్ టోర్నీ వాయిదా ఖచ్చితం అన్న సంకేతాలు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పకనే చెప్పింది.


ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగానికి కరోనా వైరస్ వల్ల తీవ్ర సంక్షోభం రావడంతో వాటి నుంచి బయటపడేందుకు ప్రపంచ టోర్నీని నిర్వహించడం కంటే టీమిండియా పర్యటనను పూర్తిస్థాయిలో నిర్వహించడమే ముఖ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. ఇక ఆస్ట్రేలియా - భారత్ మధ్యలో రెండో టెస్ట్ డే &  నైట్ గా జరగబోతోంది. విదేశాల్లో టీమిండియాకు ఇదే మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్. అలాగే జనవరిలో పెర్త్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ వేదికగా అమితుమీ తేల్చుకోనుంది . ఇకపోతే క్వారంటైన్, బయో బబుల్ ఎన్విరాన్మెంట్ లాంటి అనేక నిబంధనలు లేకుండా ఈ పర్యటన సజావుగా సాగనుంది. ఆ తర్వాత 2021 వ సంవత్సరం జనవరి నెలలో టీమిండియా మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటన కోసం వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇకపోతే చివరిగా చాలా రోజుల నుంచి అంతర్జాతీయ పోటీలు నిలిచిపోవడంతో జింబాబ్వే పర్యటనతో క్రికెట్ ను తిరిగి ప్రారంభించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: