తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన సంపాదనలో ప్రపంచ మొదటి 100 క్రీడాకారుల లిస్టులో విరాట్ కోహ్లీ 66 స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి కోహ్లీ మాత్రమే ఈ లిస్టులో పేరును దక్కించుకున్నాడు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కోహ్లీ 34 స్థానాలు ఎగబాకి 66 స్థానంలో చేరుకున్నాడు. ఇక ఇంతటి గొప్ప ఆటగాడికి తన పేరు ప్రతిష్టలు ఇవ్వమని అడిగితే అలాగే ఇచ్చేస్తానని ఆయన తెలిపాడు. ఇకపోతే తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ తో టీమిండియా కెప్టెన్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

 

ఇక అందులో తన స్థాయికి లభించిన గుర్తింపు అంతగా ఇష్టపడని కోహ్లీ పేర్కొన్నాడు. నిజానికి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా క్రికెట్ బాగా ఆడతావు అని నాకు తెలుసు. ఇతరులను ప్రేరేపించే ఎటువంటి అవకాశం వచ్చినా నేను ఇష్టపడతా అని కోహ్లీ తెలిపాడు. నిజానికి ఇక ఎవరైనా నా వద్దకు వచ్చి నీ పేరు ప్రతిష్టలు నాకు ఇవ్వు అంటే మరో మాట మాట్లాడకుండా ఇచ్చేస్తా అని కోహ్లీ పేర్కొన్నాడు. నాకు సాధారణ జీవితం గడపడం అంటే చాలా ఇష్టం అని ఒక స్థాయికి చేరాక ఏదో ముఖ్యమైన పని అదే చేస్తానని తెలిపాడు. అన్నీ అయిపోయాక చివరికి సాధారణ జీవితం గడపాలని కోహ్లీ తన వ్యక్తిత్వాన్ని తెలిపాడు.


ఇంతకు ముందు నాకు ఎక్కడికైనా వెళ్లి ఎవరితోనైనా స్వేచ్ఛగా గడపడానికి అవకాశం ఉండదు, ప్రతి నిమిషం నువ్వేం చేస్తున్నావు అని అంటి పెట్టుకోవడానికి ఉండడానికి అప్పుడు ఎవరి చేతుల్లోనూ కెమెరా ఫోన్లు ఉండేవి కావని తెలిపాడు. సమయం దొరికినప్పుడు నేను నా భార్య, అనుష్క కూడా మా ఇంట్లో ఉన్న సాధారణ పనులు చేసుకోవడానికి ఇష్టపడతానని తెలియజేశారు. అలాగే దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తానని కూడా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: