అన్ని పరిస్థితులు అనుకూలించింటే ఈ సమయానికి ఐపీఎల్ పదమూడవ సీజన్ అయిపోయి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ పూర్తిగా వాయిదాపడుతూ వస్తోంది. నిజానికి ఇప్పటికీ IPL ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇకపోతే తాజాగా కేంద్ర సూచించిన లాక్ డౌన్ 5.0 గైడ్ లైన్స్ తో అందరికీ ఐపీఎల్ పై ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం చివరి పేజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు భారీ క్రీడ ఈవెంట్ లో కూడా అనుమతి ఇచ్చే వీలు ఉండడం బిసిసిఐకి కలిసి వచ్చేలా ఉంది. నిజానికి ఈ లాక్ డౌన్ వల్ల విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటానికి లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ప్రయాణ వసతులు. విదేశాల నుంచి మన దేశానికి అంతర్జాతీయ ప్రమాణాలు చేయలేని సంగతి అందరికీ విదితమే. 


ఇకపోతే విదేశీ ఆటగాళ్లు లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించడం పై అటు కింగ్స్ లెవెన్ పంజాబ్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అందరికీ తెలిసే విధంగానే తమ వ్యతిరేకతను తెలిపాయి. ఒకానొక సమయంలో విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించాలని bcci ప్రతిపాదించింది. కాకపోతే దీని నుండి అనేక ఫ్రాంచైజ్ నుంచి వ్యతిరేకత రావడంతో దానిని బీసీసీఐ విరమించుకుంది.


ఇక తాజా సడలింపుతో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, క్రీడ వినోదం రాజకీయ మొదలగు సంబంధించి ప్రజా సమూహాలకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామంటూ శనివారంనాడు ప్రకటించిన గైడ్ లైన్స్ పరంగా క్రికెట్ ప్రేమికులను ఇప్పుడు ఆనందం చెందేలా చేస్తోంది. మరోవైపు ఈ విషయంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది నిజంగా bcci కు సానుకూల అంశమే. ఒకవేళ అంతర్జాతీయ ప్రమాణాల పునరుద్ధరణ జరిగితే క్రీడలకు పూర్వవైభవం వస్తుందని ఆయన తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: