కరోనా వైరస్ పుణ్యమా అని ఈ ప్రపంచం మొత్తం క్రీడా రంగం పూర్తిగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే క్రీడారంగం మొదలవడానికి ముందు అడుగులు వేస్తోంది. అన్ని క్రీడా రంగాల్లో ఆయా దేశాల అనుమతులు తీసుకుని కేవలం ప్రేక్షకులు లేకుండా ఆటగాళ్లు మాత్రమే పాల్గొనే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడల మొదలు పెట్టాలా జరుగుతోంది. ఇక ఇదే నేపథ్యంలో బ్రిటన్లో ప్రతిష్టాత్మకంగా జరిగే వింబుల్డన్ కూడా ఈ కరోనా మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిజంగా దీనివల్ల అనేక మంది టెన్నిస్ ప్రియులు చాలా బాధపడ్డారు. 


అసలు విషయంలోకి వెళ్తే... బ్రిటన్ లోని జరిగే ఫార్ములా వన్ కార్ రేస్ కు మాత్రం ఎలాంటి గండం లేదు. ఎంతో ఖరీదైన స్పోర్ట్స్ ఈవెంట్ కావడంతో ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. ఇక ఈ దెబ్బతో సిల్వర్ స్టోన్ వేదిక లాక్ డౌన్ నుండి పూర్తిగా తెరుచుకోబోతుంది. కాకపోతే ఇక్కడ పాల్గొనే వారి కోసం కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించని వారికి మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం జరిగింది. 

దీనితో ఇక సిల్వర్ స్టోన్ సర్క్యూట్ కార్ల మోతతో వేడెక్కనున్నది. జులై నెల, ఆగస్టు నెలలో ఒక్కో రేస్ ఇక్కడ జరగబోతుంది. దీనితో ఫార్ములా వన్ నిర్వాహకులు ఈ విషయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎఫ్ 1 నిర్వాహకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని కూడా వారు తెలిపారు. వారు సూచించిన 14 రోజుల క్వారంటైన్ ని పాటిస్తూనే తగు జాగ్రత్తలతో ముందడుగు వేస్తామని ఫార్ములావన్ నిర్వాహకులు తెలియజేశారు. ఇకపోతే రేసుల కోసం ఏర్పాట్లు పూర్తిగా చేస్తామని ఒక ఎఫ్ వన్ అధికారి తెలియజేశారు. ఇక వచ్చే నెలలో జరగబోయే సిల్వర్ స్టోన్ సర్క్యూట్ కంటే ముందుగా జూలై 5, 12 వ తారీకులలో ఆస్ట్రియాలో, 19వ తేదీన హంగేరిలో రేస్ లు జరగబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: