క్రికెట్ లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి మైదానంలోకి అడుగుపెట్టాడు  అంటే నిలుచున్న చోటే భారీ షాట్లు ఆడగల సత్తా క్రిస్ గేల్  సొంతం. ఒకసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే క్రిస్ గేల్ను ఆపడం కష్టమే. ఇక క్రిస్ గేల్ తన ఆటతో ఎన్నో అద్భుత షాట్ లను  కూడా ఆడుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. భారీ స్కోర్లు నమోదు చేస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు క్రిస్ గేల్. అయితే కేవలం ఆట  తోనే కాదు మైదానంలో  తనదైన ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు పంచుతూ ఉంటాడు. తన చేష్టలతో ఎప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు క్రిస్ గేల్. 

 


 అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ గేల్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ప్రత్యర్థి ఆటగాళ్ళతో సైతం సరదాగా స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఇక తన బౌలింగ్తో బ్యాటింగ్  తో కూడా ఆధరగొడుతూ వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు క్రిస్ గేల్. మామూలుగా అయితే వెస్ట్ఇండీస్ కు సంబంధించిన చాలామంది నల్లజాతీయులు  వివక్షలను ఎదుర్కొంటుంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక వ్యక్తి పట్ల వివక్ష చూపించడం చట్టపరమైన నేరము అయినప్పటికీ కొంతమంది ప్రముఖులు సైతం ఇలాంటి వివక్ష  ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉంటాయి. 

 


 తాజాగా క్రిస్ గేల్ కూడా ఇదే చెబుతున్నారు.. తాను కూడా ఒకానొక సమయంలో విపక్ష ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ గేల్.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్న వివక్ష క్రికెట్ ఆటలో కూడా ఉంది అంటూ క్రిస్ గేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్లజాతీయులు కూడా అందరిలాంటి మనుషులమే అంటూ భావోద్వేగ పూరితమైన వ్యాఖ్యలు చేశాడు .  మమ్మల్ని మనుషుల్లా  చూడాలని తెలివితక్కువ వారిలా  చూడకూడదు అంటూ వ్యాఖ్యానించాడు. క్రికెట్ లో భాగంగా ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తాను వివక్షకు గురయ్యారు అంటూ క్రిస్ గేల్ తెలిపాడు. ఇలాంటి వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని... ప్రపంచం తీరులో మార్పు రావాల్సి ఉంది అంటూ వ్యాఖ్యానించాడు . ఇక ఈ యూఎస్ లో జరుగుతున్న జాత్యహంకార పోరాటానికి మద్దతు ప్రకటించాడు క్రిస్ గేల్.

మరింత సమాచారం తెలుసుకోండి: