కరోనా వల్ల గత రెండునెలల నుండి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడా స్తంభించిపోయింది. అయితే కరోనా ప్రభావం లేని దేశాలు క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించడానికి సిద్దమవుతున్నాయి అందులో భాగంగా మొదటి అంతర్జాతీయ సిరీస్ ఇంగ్లాండ్- వెస్టిండీస్ ల మధ్య జులై 8నుండి ప్రారంభం కానుంది. ఈమేరకు ఈసీబీ అధికారికంగా ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ వేదికగా ఆతిథ్య జట్టుతో  వెస్టిండీస్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడనుంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైయింది. 
 
మొదటి టెస్టు: జులై 8-12 ఏజెస్ బౌల్, సౌతాంఫ్టన్   
రెండో టెస్టు : జులై 16-20 ఓల్డ్ ట్రాఫర్డ్ , మాంచెస్టర్ 
మూడో టెస్టు :జులై 24-28 ఓల్డ్ ట్రాఫర్డ్ , మాంచెస్టర్ 
 
ఈమూడు టెస్టులు కూడా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ మైదానాల్లో జరుగనున్నాయి అయితే  యూకే ప్రభుత్వం నుండి ఈసిరీస్ జరగడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావల్సివుంది. జూన్ 9న వెస్టిండీస్ ,ఇంగ్లాండ్ కు చేరుకోనుంది అనంతరం విండీస్ జట్టు 14రోజులు క్వారంటైన్ లో ఉండనుంది. నిజానికి ఈ సిరీస్ జూన్ 4న ప్రారంభం కావాల్సివుంది అయితే కరోనా వల్ల రీ షెడ్యూల్ చేశారు.
 
ఇదిలావుంటే ఇటీవల ఆస్ట్రేలియా కూడా ఇండియా తో  జరుగనున్న సిరీస్ ల షెడ్యూల్ ను ప్రకటించింది. అక్టోబర్ లో భారత్ ,ఆస్ట్రేలియా పర్యటనకు రానుండగా ఆతిథ్య జట్టు తో మూడు టీ 20లు, మూడు వన్డేలు .నాలుగు టెస్టుల్లో తలపడనుంది. అక్టోబర్ 11న ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 జరుగనుంది. ఇక మరోవైపు ఈఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో జరుగాల్సిన టీ 20 ప్రపంచ కప్ వచ్చే ఏడాదికి వాయిదాపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: