టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం అతడు ఆడే ఆట. బౌలర్ ఎవరైనా సరే.. గ్రౌండ్ ఏదైనా సరే... బాల్ ని బౌండరీకి తరలించే వ్యక్తులలో ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న బ్యాట్స్మన్ అని చెప్పవచ్చు. ఇకపోతే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అంతర్జాతీయ 100 శతకాల రికార్డును భారత ప్రస్తుత టీం కెప్టెన్ కోహ్లీ బద్దలు కొడతాడని టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇప్పటికే అటు వన్డేల్లో, ఇటు టెస్ట్ మ్యాచ్లో కలిపి 70 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ గత మూడు సంవత్సరాల నుంచి తన కెరీర్లో బెస్ట్ ప్రదర్శన అని చూపిస్తున్నాడని తెలియజేశాడు.

 


ఇప్పటికే అనేక రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఆ రికార్డును కూడా అతి త్వరలో బద్దలు కొడతాడని తెలిపాడు. ఇకపోతే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తను సాధించిన 100 శతకాలలో 51 శతకాలు టెస్ట్ మ్యాచ్లలో సాధించగా, 49 శతకాలు వన్డేల్లో సాధించారు. ఇకపోతే ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ వన్డేలో 43 సెంచరీలు మైలురాయిని అందుకు సచిన్ రికార్డు కి చాలా చేరువలో ఉన్నారు. ఇటు టెస్టుల్లో చూస్తే విరాట్ కోహ్లీ కేవలం 27 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సచిన్ లాగా సుదీర్ఘంగా కెరీర్ ను కొనసాగించగలిగితే కోహ్లీ అవలీలగా వంద సెంచరీలు నమోదు చేయగలరని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.

 


ఇక అంతేకాకుండా వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అవలీలగా దాటేస్తాడని, కాకపోతే వంద సెంచరీల రికార్డును మాత్రం బ్రేక్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలిపాడు. ఆ రికార్డును కోహ్లీ అందుకోవాలంటే పూర్తిగా తన ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగేలా ఉండాలని తెలిపాడు. ఏదేమైనా మొత్తానికి కోహ్లీ ఒక్కడే సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు అని ఇర్ఫాన్ పఠాన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: