ప్ర‌పంచంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రు.... ఇది చాలా క్లిష్ట‌మైన ప్ర‌శ్నే. అయితే బ్రెట్‌లీ మాత్రం నిస్సంకోచంగా స‌చిన్ పేరు చెప్పేశాడు. ఆ త‌ర్వాత స్థానంలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గ‌జం బ్రియ‌న్ లారా నిలుస్తాడ‌ని పేర్కొన్నాడు. ఇక  ఆల్‌రౌండ‌ర్‌గా..క్రికెట్‌లో ప‌రిపూర్ణత‌కు మారుపేరుగా  ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ క‌ల్లిస్ నిలిచాడ‌ని చెప్పాడు. ఎందుకు త‌న దృష్టిలో నెంబ‌ర్ వ‌న్‌, నెంబ‌ర్ టూ, బెస్ట్ క్రికెట‌ర్‌గా నిలిచారో కూడా వివ‌రించ‌డం విశేషం. సచిన్‌ తరహాలో ఎవరూ బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. చూస్తాను అని కూడా అనుకోవ‌డం లేదు. క్రీజులో కుదురుకునేందుకు  ఎక్స్‌ట్రా టైమ్‌ తీసుకుని షాట్లు ఆడుతుంటాడు.

 

చెత్త షాట్ల‌ను త‌క్కువ‌గా ఎంచుకుంటాడు. మంచి బౌలింగ్‌ను గౌర‌విస్తాడు.  క్రీజ్‌లో వచ్చాక నిలదొక్కుకోవడానికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక స‌చిన్‌ను అవుట్ చేయ‌డం అన్న‌ది బౌల‌ర్ల‌కు క‌ష్టంగా మారుతుంది. బంతిపై స‌చిన్ చూపే ఏకాగ్ర‌తే త‌న మెరుగైన ఆట‌తీరుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నేను అనుకుంటున్నాను. అందుకే స‌చిన్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ అయ్యాడు. వరల్డ్‌లో సచినే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఇక  లారా ఎంతో భిన్న‌మైన క్రికెట‌ర్‌.  లారా హిట్టింగ్ అద్బుతంగా ఉంటుంది. త‌క్కువ బంతుల్లో ఎక్కువ ప‌రుగులు సాధించ‌గ‌ల స‌త్తా ఉన్నా ఆట‌గాడు. 

 


ముఖ్యంగా సిక్స్‌లు కొట్టడంలో లారాకు లారానే సాటి. బౌలర్‌ ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా వైవిధ్య‌మైన రీతిలో వేర్వేరు చోట్ల‌కు సిక్స్‌లుగా మ‌ల్చ‌గ‌ల స‌త్తా ఉన్నా ఆట‌గాడు. అతను క్రికెట్‌ ఆడే కాలంలో ప్రేక్ష‌కుల‌ను ఇట్టే ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇదే. ‘జాక్వస్‌ కల్లిస్‌ కంప్లీట్‌ క్రికెటర్ అని చెప్పాలి.  బ్యాట్స్‌మన్‌గా,  బౌలర్‌గా రాణించే సామ‌ర్థ్యం ఉన్న ఆట‌గాడు కల్లిస్‌. ఫీల్డర్‌గా కూడా కల్లిస్‌ది ప్రత్యేక స్థానం. స్లిప్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న ఘ‌న చ‌రిత్ర ఆయ‌న‌కున్న‌ది.  సచిన్‌ తాను చూసిన బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అయితే కల్లిస్‌ బెస్ట్‌ క్రికెటర‌ని  బ్రెట్‌లీ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.1999లో భారత్‌పై అరంగేట్రం చేసిన బ్రెట్‌ లీ.. ద‌శాబ్ద కాలం పాటు ఆసీస్‌ప్ర‌ధాన బౌల‌ర్‌గా కొన‌సాగిన విష‌యం తెలిసిందే.
ప్రపంచ క్రికెట్‌లో షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌ లీలది ప్రత్యేక స్థానమ‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: