జులై 8నుండి వెస్టిండీస్,ఇంగ్లాండ్ ల మధ్య జరుగనున్న మొదటి టెస్టు తో అంతర్జాతీయ క్రికెట్ పున:ప్రారంభం కానుందని తెలిసిందే. బయో సెక్యూర్ వాతావరణంలో ఈటెస్టు సిరీస్ జరుగునుంది. ఈమూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం జూన్ 9న విండీస్ టీం ఇంగ్లాండ్ కు రానుంది అయితే  ఈపర్యటనకు విండీస్ స్టార్ ప్లేయర్లు డారెన్ బ్రావో ,హేట్మేయర్, కీమో పాల్ దూరమయ్యారు. ఇక వీరు ఎందుకు ఈపర్యటన నుండి తప్పుకోన్నారో క్రికెట్ వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జానీ గ్రేవ్ వెల్లడించాడు.   
 
ఈముగ్గురు సెంట్రల్ కాంట్రక్టు ఆటగాళ్లు అయితే వారు ఇంగ్లాండ్ పర్యటనకు రాకపోవడానికి గల కారణాలను మెయిల్ ద్వారా తెలియజేశారు. వారి నిర్ణయాన్ని బోర్డు స్వాగతిస్తుందని గ్రేవ్ పేర్కొన్నాడు. ఇక మెయిల్ లో ఏం చెప్పారో కూడా గ్రేవ్ తెలియపరి చాడు. తన మీదనే తన కుటుంబం ఆదారపడుతుందని ఇలాంటి సమయంలో నాకేదైనా జరిగితే తీవ్ర నష్టం కలుగుతుందని అందుకనే ఈ సిరీస్ కు దూరంగా వుంటున్నానని కీమో పాల్ మెయిల్ లో వివరించాడు అలాగే బ్రావో కూడా యూకే లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి అందువల్ల ఇంగ్లాండ్ పర్యటనకు రావడం ఇష్టం లేదని తెలిపాడు.
 
ఇక హేట్మేయర్ కూడా ఫ్యామిలీ వల్లనే పర్యటనకు దూరం అయ్యాడు. తను ఇంగ్లాండ్ వెళ్లడం తన వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదని ఒకవేళ వెళ్ళాక నాకేమైనా అయితే తన కుటుంబం కష్టాల్లో పడుతుంది అందుకే ఈ పర్యటనుండి తప్పుకుంటున్నాని హేట్మేయర్ వివరణ ఇచ్చాడని గ్రేవ్ అన్నాడు. ఇదిలావుంటే ఈ టెస్టు సిరీస్ కు ఇప్పటికే 14మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్ మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: