అజింక్యా రహానే... ప్రస్తుతం టీమిండియా జట్టులో ఆటగాడు. 1988 వ సంవత్సరం జూన్ 6న ఈయన మహారాష్ట్రలోని అశ్వి ప్రాంతంలో జన్మించారు. నేటితో ఈయన తన 33 వ వసంతం లోకి అడుగుపెట్టబోతున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా తను మన టీమిండియాకు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అజింక్యా రహానే టీమిండియా టెస్ట్ మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి విధితమే. అలాగే రహనే పూర్తి పేరు అజింక్యా మధుకర్ రహానే. అజింక్య రహానే తన 19 వ సంవత్సరం లోనే మొదటిసారిగా ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా ఏకంగా అండర్ 19 తరఫున టీమిండియాకు ఆడాడు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో తన ఫస్ట్ క్లాసు కెరీర్ ను మొదలు పెట్టాడు. తన మొదటి మ్యాచ్ లోనే 207 బంతుల్లో 143 పరుగులు చేశాడు. ఈ ఒక్క మ్యాచ్ తోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.. 

 


ఇక ఆ తర్వాత రహానే తన మొదటి టెస్టును వెస్టిండీస్ జట్టుతో 2011 సంవత్సరంలో ఆరంగ్రేటం చేశాడు. ఇక అలాగే 2011 సంవత్సరంలోనే ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఆరంగ్రేటం చేశాడు. ఇక అదే టూర్ లోనే ఇంగ్లాండు తోనే టి20 కెరియర్ ను కూడా ఆరంభించాడు. ఇకపోతే ఇప్పటివరకు తను ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్ జట్ల ద్వారా ఐపీఎల్ లో ఆడాడు. రహానే ఇప్పటివరకు 65 టెస్ట్ మ్యాచ్లు ఆడి 4,200 పైగా పరుగులు సాధించాడు. ఇక ఇందులో 11 సెంచరీలు 22 అర్థ సెంచరీలు ఉండగా 188 తన అత్యధిక స్కోరు గా ఉంది. ఇక అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో 90 వన్డేలు ఆడిన అతను 2960 రెండు పరుగులు చేసి మూడు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలతో కొనసాగుతున్నాడు. ఇక అలాగే టీ 20 లో ఆడిన అతను 20 మ్యాచ్ లలో 375 పరుగులు సాధించి ఒక అర్ధ సెంచరీని మాత్రమే అందుకోగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: