భారతదేశంలో క్రికెట్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అది వెస్టిండీస్ లో అయితే ఎవరి పేరు తెలుసా అదే నండి బ్రియాన్‌ లారా... సరిగ్గా ఇదే రోజు 26 ఏళ్ల సంవత్సరాల క్రితం ఒక రికార్డు నెలకొల్పాడు. అది ఇప్పటి వరకు చెక్కుచెదరలేదు అంటే అది ఎంత భారీగా ఉంటుందో ఆలోచించండి. అవును నిజమే.. తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 501 పరుగులతో అజేయంగా నిలిచి ప్రపంచ రికార్డును సృష్టించాడు. 1996 సంవత్సరంలో బర్మింగ్ హమ్ లో జరిగిన ఒక కౌంటీ చాంపియన్షిప్ లో అతడు ఈ రికార్డును సాధించాడు. ఆయన ఏకైక మ్యాచ్లో ఒకటేసారి 501 చేసి అందులో నాట్ అవుట్ గా నిలవడంతో ప్రపంచ దృష్టిని ఆయన వైపు తిప్పుకున్నాడు. 

 

 

ఆ మ్యాచ్ కి కొద్ది కేవలం 2 నెలల ముందే అంట్విగా లో ఇంగ్లాండ్ జట్టు పై 375 పరుగులు చేసి రికార్డు నమోదు చేశాడు. కేవలం రెండు నెలలకే మరో మైలురాయిని అవలీలగా అందుకున్నాడు. విండీస్ దిగ్గజం లారా తన సంచలన ఇన్నింగ్స్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాకిస్థాన్ కు చెందిన మరో బ్యాట్స్మన్ పై ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. ఇక మ్యాచ్లో బ్రెయిన్ లారా 427 బంతుల్లో ఏకంగా 60 రెండు బౌండరీలు 10 సిక్సర్ల సహాయంతో ఈ రికార్డును నెలకొల్పాడు. అంతేకాదు ఇప్పటి వరకు ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో కూడా బ్రియాన్‌ లారా దే అత్యధిక స్కోరు. 2004 సంవత్సరంలో ఇంగ్లాండ్ పై ఏకంగా 400 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రియాన్‌ లారా అనేక చిరస్మరణీయ విజయాలను వారి జట్టుకు అందించాడు. బ్రెయిన్ లారా తన క్రికెట్ కెరియర్ లో 131 టెస్టులు ఆడారు. అందులో 34 సెంచరీలు 48 సెంచరీలు ఉన్నాయి.

 

ఇక ఈ అంశాన్ని ట్విట్టర్ ద్వారా ఒక సంస్థ ఈ విషయాన్ని తెలియజేయగా సచిన్ టెండూల్కర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రత్నం లాంటి ఇన్నింగ్స్ రత్నం లాంటి మనిషి నుండి వచ్చింది అంటూ కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: