వన్డేల్లో మూడో డబుల్ సెంచరీని రోహిత్ శర్మ అందుకున్న సమయంలో స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అతని భార్య రితిక కన్నీళ్లు పెట్టుకుందంట‌. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు రోహిత్ శ‌ర్మ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. క్రికెటర్లంతా తమ ఇళ్లలోనే ఉంటూ తోటి ఆటగాళ్లు లైవ్‌చాట్‌లో  పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. వివిధ టోర్నీలు..ఆయా మ్యాచుల్లో వారికెదురైన అనుభ‌వాల‌ను అభిమానుల‌తో నేరుగా పంచుకుంటున్నారు. ఈక్ర‌మంలోనే ఈ జాబితాలో..భారత  క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్ చేరిపోయారు.  బీసీసీఐ టీవీలో నిర్వహించిన 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌' షోలో సరదాగా వీరిద్ద‌రూ మాట్లాడారు.


రోహిత్‌శ‌ర్మ త‌న కెరీర్‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. తన మూడో డబుల్‌ సెంచరీని గుర్తు చేసుకున్నాడు. కొద్ది క్ష‌ణాల్లో మూడో డ‌బుల్ సెంచ‌రీ చేస్తాను అన్న స‌మ‌యంలో నా భార్య రితికా క‌న్నీరు పెట్టుకుంద‌ని వెల్ల‌డించాడు. వాస్త‌వానికి ఆమె అంత ఉద్వేగానికి ఎందుకు లోనైందో ఆ స‌మ‌యంలో నాకు అర్థం కాలేదు. అయితే ఆ మ్యాచ్‌లో నేను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్‌ తీయాల్సి వచ్చింది. పరుగు కోసం పరిగెత్తిన నేను డైవ్‌ చేశాను. డైవ్ చేసిన‌ప్పుడు బ‌ల‌మైన గాయ‌మైంద‌ని భావించి ఏడ్చేసిన‌ట్లు ఆ త‌ర్వాత నేను అడిగిన‌ప్పుడు చెప్పింది. అయితే మొహాలీలో చేసిన డబుల్‌ సెంచరీ ఎప్ప‌టికీ నాకు ప్ర‌త్యేకం. ఎందుకంటే ఆ రోజు నా పెళ్లి రోజు కూడా అంటూ మయాంక్‌తో త‌న తీపి జ్ఞాప‌కాల‌ను రోహిత్‌శ‌ర్మ పంచుకున్నాడు.


వన్డే క్రికెట్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రోహిత్ నిలిచిపోయాడు. రోహిత్‌ సాధించిన మూడు డబుల్‌ సెంచరీల్లో రెండు శ్రీలంకపై  ఉండ‌గా, మ‌రోక‌టి ఆస్ట్రేలియాపై 2013లో  సాధించాడు. టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముక‌గా ఉన్న రోహిత్‌శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 224 వన్డేల్లో 9115 పరుగులు సాధించాడు. అలాగే 32 టెస్టుల్లో 2141 పరుగులు, 108 టీ20ల్లో 2773 పరుగులు సాధించాడు.టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ క్రీజులో కుదురుకుంటే అవలీలగా పరుగులు రాబట్టేస్తుంటాడు. మ్యాచ్ గమానికి అనుగుణంగా గేర్చు మార్చుకుంటే వెళ్లే రోహిత్ శర్మ.. టాప్‌గేర్‌లోకి వెళ్లాడంటే భారీ స్కోర్లు నమోదవాల్సిందే. ఫార్మాట్‌కి అనుగుణంగా బ్యాటింగ్ స్టయిల్‌ని మార్చుకునే ఈ హిట్‌మ్యాన్‌గా పేరు పొందాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: