వెస్టిండీస్ తో స్వదేశంలో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుందని తెలిసిందే. ఇక ఈసిరీస్ తరువాత మరికొన్ని సిరీస్ లను ప్లాన్ చేస్తుంది ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). అందులో భాగంగా పాకిస్థాన్ ,ఆస్ట్రేలియా ,ఐర్లాండ్ క్రికెట్ బోర్డు లతో సంప్రదింపులు జరుపుతుంది. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ముగిశాక ఈమూడు దేశాలను ఇంగ్లాండ్ లో పర్యటించాల్సిందిగా ఈసీబీ కోరింది అయితే ఆ మూడు దేశాలు మాత్రం ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఒకవేళ వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ సజావుగా సాగితే  పాక్, ఆస్ట్రేలియా ,ఐర్లాండ్.. ఇంగ్లాండ్ లో పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   
 
ఇక ఈపర్యటన కోసం జూన్ 9న వెస్టిండీస్ ,ఇంగ్లాండ్ కు చేరుకోనుంది అనంతరం విండీస్ జట్టు  సభ్యులంతా 14రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు. ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో జరుగనుంది. కాగా మొదటి టెస్టు జులై 8-12 వరకు సౌతాంఫ్టన్ లోని ఏజెస్ బౌల్ వేదికగా జరుగనుండగా రెండో టెస్టు జులై 16-20 వరకు, మూడో టెస్టు జులై 24-28  వరకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికలో జరుగనున్నాయి. అయితే యూకే ప్రభుత్వం నుండి ఈసిరీస్ కు ఇంకా గ్రీన్ సిగ్నల్ రావల్సివుంది.
 
ఇదిలావుంటే ఇంగ్లాండ్ తో సిరీస్ కు క్రికెట్ వెస్టిండీస్  తమ జట్టును ప్రకటించింది. మొత్తం 21మంది  ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయగా అందులో 11మంది రిజర్వ్ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. అయితే డారెన్ బ్రావో ,హేట్మేయర్ ,కీమో పాల్ మాత్రం ఈసిరీస్ కు దూరంగా వున్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: