ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంతో క్రీడాకారుల అందరూ కూడా ఇంట్లోనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తన కూతురు సమైరా తో సరదాగా ఆటలు ఆడుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడు. ఇకపోతే మార్చి నెల నుండి క్రికెట్ సిరీస్ లు అన్ని రద్దు అవ్వగా అప్పటినుంచి రోహిత్ శర్మ ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబంతో ఆనందంగా గడిపేస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

These days are not coming back....

A post shared by rohit Sharma (@rohitsharma45) on

 


తాజాగా తన కూతురితో ఎంజాయ్ చేస్తున్న సమయాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో రోహిత్ శర్మ పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ వీడియోకి " ఈ రోజులు మళ్ళీ రావు " అంటూ క్యాప్షన్ ని కూడా జత చేశారు. 2015 సంవత్సరంలో రోహిత్ శర్మ తన చిన్ననాటి స్నేహితురాలైన రితిక ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇకపోతే 2018 సంవత్సరంలో ఈ జంటకు సమైరా జన్మించింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ సిరీస్ మధ్యలోనే భారత్ కు వచ్చి తన కూతురుని చూసి తిరిగి మళ్ళీ టీం లో చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: