ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో జరగాల్సిన భారత్ - ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ రద్దు అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11 నుండి 17 వ తారీకు వరకు ఆస్ట్రేలియా గడ్డపై 3 t20 లను ఆడాల్సి ఉండగా అక్టోబర్ 18 నుంచి మొదలవ్వాల్సిన టి20 వరల్డ్ కప్ వాయిదా పడుతుండడంతో ఈ సిరీస్ ను కూడా రద్దు చేయాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ధారణ చేసినట్లు తెలుస్తోంది.


ఇకపోతే వాస్తవానికి టి20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ కోసమే బీసీసీఐ ఈ టి 20 సిరీస్ ఆడేందుకు సుముఖతను తెలియజేసింది. ఇకపోతే కరోనా వైరస్ కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ నెల వరకు పర్యాటక విశేషాలపై పూర్తి నిషేధం విధించడంతో షెడ్యూల్ ప్రకారం టి20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా లేదన్నట్లు తేల్చి చెప్పేసింది. ఇక దీంతో ఐసీసీ ప్రపంచ కప్పును వాయిదా వేయాలని ఆలోచిస్తుండగా... ఇక అదే సమయంలో భారత్లో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. నిజానికి టి20 వరల్డ్ కప్ వాయిదా పడితే టీమ్ ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ అవసరం లేదన్న కారణంతో ఆ సిరీస్ ను రద్దు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. కాకపోతే ఆ సమయంలో భారత్లో ఐపీఎల్ ని జరిపేలా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.


ఇకపోతే అక్టోబర్ నవంబర్ నెలల్లో టీమిండియా క్రికెటర్లు బిజీగా ఉండబోతున్నారు. ఆ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగో టెస్ట్ సిరీస్ లో ఆడేందుకు వారు సిద్ధమని ఇటీవల బిసిసిఐ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే టి20 వరల్డ్ కప్ వాయిదాపై ఈనెల 10న ఐసిసి నిర్ణయం ఉండగా ఇక అదే రోజు ఈ టీ 20 సిరీస్ పైన కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: