భారతదేశంలో క్రికెట్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సచిన్ టెండూల్కర్. అలాగే సచిన్ సాధించిన విజయాలు. ఈ తరుణంలోనే 2011 లో 100 వ సెంచరీ కోసం యావత్ భారత దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరిగింది. నాగపూర్ లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో 99వ సెంచరీ తీశాడు సచిన్. ఆ తరువాత వరుసగా తక్కువ స్కోర్ లతోనే వెనుతిరగడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా 2011లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో అభిమానుల అనుకున్న విధంగానే సచిన్ వందో సెంచరీకి కేవలం 9 పరుగుల దూరంలో ఉండడం జరిగింది.

 


అయితే అప్పుడు అభిమానులు ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్ బౌలింగ్ లో  సచిన్ ఎల్ బిడబ్ల్యు గా వెనుదిరగడం జరిగింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిమాణాలను గుర్తుచేసుకుంటూ తాజాగా సోషల్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మ్యాచ్లో తాను సచిన్ ఎల్బీడబ్ల్యూ చేసినందుకు  అంపైర్ రోడ్ టక్కర్ అవుట్ ఇచ్చినందుకు గాను నన్ను, ఆయన్ని ఇద్దరు చంపుతామని బెదిరించారు కూడా అంటూ తెలిపాడు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా వేలాది మంది అభిమానులు నుంచి కూడా నాకు వార్నింగ్ వచ్చాయని టిమ్ బ్రెస్నన్ తెలియజేశాడు.  

 


ఇక ఏకంగా అంపైర్ కు అయితే ఇంటికి బెదిరింపు లేఖ పంపించారు అంటే నమ్మండి. నీకు ఎంత ధైర్యం ఉంటే సచిన్ ను ఔట్ చేసి చేస్తావ్...? అసలు బాల్ అవుట్ స్వింగ్ పూర్తిగా మిస్ అవుతుంది అని రాసేవారిని  అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నాడు. గత కొన్ని నెలల తర్వాత అయితే అతన్ని నేను కలిస్తే భయమేసి పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి అంటూ టిమ్ బ్రెస్నన్ వివరించడం జరిగింది. ఏది ఏమైనా కానీ భారతదేశంలో సచిన్ కు ఉన్న అభిమానుల ఫాలోయింగ్ వేరే లెవెల్ అంటే నమ్మండి.

మరింత సమాచారం తెలుసుకోండి: