కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం పూర్తిగా స్తంభించింది. ఈ క్రీడను తీసుకున్న పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా లాక్ డౌన్ కారణంతో పూర్తిగా రద్దు అవ్వడంలేదా వాయిదా పడుతూ వచ్చాయి. అంతెందుకు నాలుగు సంవత్సరాలు వచ్చే ఒలంపిక్స్ కూడా వాయిదా పడ్డాయని ఆలోచించండి పరిస్థితి ఏవిధంగా ఉందో...  


ఇకపోతే క్రికెట్ అభిమానులు అందరూ ఉత్సాహంగా ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ భవిష్యత్తు రేపు తేలిపోతోంది. ఐసీసీ బుధవారం నాడు సమావేశమై ఈ అంశంపై ఒక సరైన నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఇకపోతే ఈ టి20 వరల్డ్ కప్ ను ఐసీసీ ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుండి నవంబర్ 16 వరకు నిర్వహించాలని క్రితం తెలిపిన షెడ్యూల్ ప్రకారం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం కరోనా మహమ్మారి దెబ్బకు ఈ టోర్నమెంట్ అసలు జరపాలా..? జరపకూడదా..? అన్నది ప్రశ్నగా మారి పోయింది.

IHG

 

ఇకపోతే ఈ అంశంపై రేపు ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాలనే విధంగా కనబడుతోంది. ఈ సమావేశంలో మొత్తంగా ఐదు అంశాలను చేర్చినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ అంశాల విషయానికొస్తే కేవలం టి20 వరల్డ్ కప్ మాత్రమే కాకుండా ఐసీసీ చైర్మన్ ఎన్నిక భవిష్యత్తు ప్రణాళిక పన్ను ఆధారిత సంబంధాల విషయాలు ICC, bcci సీఈఓ లు సమర్పించిన రహస్య నివేదిక రేపు సమావేశం జరగబోతోంది. ఇక ఇలా ఉండగా ఐసీసీ చైర్ పర్సన్ శశాంక్ మనోహర్ తన పదవి కాలం పెంచుకునేందుకు ఆసక్తిగా లేదని ఇదివరకే తెలిపారు. అయితే ఆ పదవిని ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని నేపథ్యం వహించాల్సిందిగా డిమాండ్ వస్తుందని ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి రేపు జరగబోయే సమావేశంలో వరల్డ్ కప్ భవితవ్యం తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: