ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతోంది. ఇక కొన్ని దేశాలలో కరోనా వైరస్ లాక్ డౌన్ సడలించడంతో క్రీడా పోటీలు, ఈవెంట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇదే తరుణంలోనే తాజాగా వెస్టిండీస్ క్రికెట్ టీం ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరడం జరిగింది. ఇక బ్రిటన్ దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గక పోయినప్పటికీ కూడా విండీస్ బోర్డ్ ఇంగ్లాండు టూర్ కు వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయం. ఇక సిరీస్ మొదలుతో క్రికెట్ పునరుద్ధరణకు ఒక ముందడుగు వేసినట్లు అంటూ విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలియజేశాడు.

 


ఇక వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండు టూర్ కి మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం వెళ్లడం జరిగింది. ఇక జట్టు ఆటగాళ్లు అందరూ కూడా వెస్టిండీస్ లోని అంటిగ్వా నుంచి ఇంగ్లాండ్ మాంచెస్టర్ చేరుకున్నారు. ఇక వాళ్ళందరూ ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ లో వెస్టిండీస్ ఆటగాళ్లందరూ క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇక ఆ తర్వాత అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూడు వారాల పాటు శిక్షణ అనంతరం తొలి టెస్ట్ కోసం సౌతాంప్టన్‌ కు వెళ్లనున్నారు.

 


ఇకపోతే ఆ తర్వాత మరి చివరి రెండు టెస్టుల కోసం మళ్లీ మాంచెస్టర్ కు తిరిగి రానున్నారు.ఇకపోతే ఇంగ్లాండ్ అన్ని జాగ్రత్తలు నడుమ బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్లను నిర్వహించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ పూర్తి ఏర్పాట్లను చేస్తోంది. ఈ సిరీస్ ఈ నెలలోనే జరగాల్సి ఉండగా అది కాస్తా కరోనా కారణంగా వచ్చే నెల 8 నుంచి మొదలు పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: