గత మూడు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో అన్ని రంగాలు కూడా మూత పడ్డాయి. రాజకీయ నేతలు, ప్రముఖులు, క్రీడారంగం ఆటగాళ్లు అందరూ కూడా ఇళ్లకే పరిమితమై వారి కుటుంబ సభ్యులతో ఈ లాక్ డౌన్ సమయాన్ని గడిపేశారు. ఇక తాజాగా లాక్ డౌన్ లో కొన్ని సడలింపులతో క్రీడారంగంలో మళ్లీ పోటీలు జరిగేందుకు సిద్ధమవుతున్నాయి.

 

IHG


ఆగస్టు నెలలో టీంఇండియా - శ్రీలంక  పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ ఆటను పునప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన మూడు నెలల నుంచి క్రికెట్ సీరిస్ లు నిలిచిపోగా.. కోహ్లీసేన శ్రీలంకతో మళ్లీ మైదానంలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు శ్రీలంక క్రికెట్ బోర్డుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శ్రీలంకకు చెందిన ది ఐలాండ్ పత్రిక తెలియజేయడం జరిగింది.

 


అలాగే టీమ్ ఇండియా జట్టు శ్రీలంక టూర్ కు భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినట్లు తెలియచేసింది. ఇక జూన్ నెలలో శ్రీలంక జట్టుతో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టి20 లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ఇది సాధ్యం కాకపోవడంతో వీటిని ఆగస్టు నెలలో నిర్వహించేందుకు శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ SLC ని అనుమతి అడగడం జరిగింది. ఇక కరోనా వైరస్ తరుణంలో విధించిన చాలా సడలింపులు కూడా ఆగస్టు నెలలో తొలగిపోతున్నాయని ఆ అంచనాలతో సిరీస్ లకు ఆగస్టులో నిర్వహించేందుకు శ్రీలంక సిద్ధమయ్యింది. అలాగే SLC నిర్వహించే మ్యాచ్ ల ద్వారా వచ్చే టీవీ హక్కుల ఆదాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త బయట పడవచ్చు అని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: