గత మూడు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్ 2020 సీజన్ జరగడం దాదాపు ఖాయమని తెలిసిపోతోంది. మామూలుగా ఈ సంవత్సరం సీజన్ మార్చి 29 వ తారీకు నుండి మొదలవ్వాల్సి ఉండగా అది కాస్త కరోనా పుణ్యమా అని ఏప్రిల్ 15 కి వాయిదా పడిన ఆ తర్వాత కూడా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది.

 


ఇకపోతే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా దేశంలో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ ఐసిసి వాయిదా వేసే దిశగా కనిపించడంతో ఇక ఆ నెలలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బుధవారం నాడు మీటింగ్ లో చర్చించిన ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ వచ్చేనెలలో ప్రకటిస్తామని తెలిపింది. ఒకవైపు టి20 వరల్డ్ కప్ జరిగే స్థితి వాయిదా పడడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ సంఘాలకి తాజాగా బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ స్వయంగా లేఖ రాశారు.

 


ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ అయితే మాత్రం బీసీసీఐ సుమారు 4 వేల కోట్ల వరకు నష్టం పోవాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమే ఐపీఎల్ ఎలాగైనా నిర్వహించాలని అనేక మార్గాలను బీసీసీఐ అన్వేషించడంలో ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ సమయాన్ని కాస్త ఐపీఎల్ కొరకు వినియోగించబడుతుంది అని అర్థమవుతుంది. ఇకపోతే 2020 ఐపీఎల్ సీజన్ కు ఆదిత్యం ఇస్తాము అంటూ శ్రీలంక, యూఏఈ క్రికెట్ బోర్డులు ముందుకు రావడం జరిగింది. ఇకపోతే గంగూలీ రాసిన లేఖలో భారత్లోని ఐపీఎల్ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక మంది విదేశీ ఆటగాళ్లు కూడా తాము ఐపీఎల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక అతి త్వరలో ఐపీఎల్ 2020 సీజన్ బీసీసీఐ పూర్తి కార్యాచరణ ప్రకటించిన పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: