ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆగస్టు -సెప్టెంబర్ లో  ఆతిథ్య జట్టుతో పాకిస్థాన్ మూడు టెస్టుల సిరీస్ తోపాటు మూడు టీ 20ల సిరీస్ లో తలపడనుంది. అందుకోసం జులై లో పాక్ జట్టు ఇంగ్లాండ్ కు చేరుకుంది. ఇక ఈపర్యటన నుండి పాక్ స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ , అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హారిస్ సోహైల్ తప్పుకున్నారని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)  అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు లో అమీర్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది అందువల్ల అమీర్ ఈపర్యటన నుండి తప్పుకోగా హారిస్ సోహైల్ వ్యక్తిగత కారణాల తో అందుబాటులో ఉండడం లేదు. కాగా అమీర్ కు ఈఏడాది పాక్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వలేదు. 
 
ఇక ఈపర్యటనకు పీసీబీ 28 ఆటగాళ్ల తోపాటు 14 మంది స్టాఫ్ ను ఇంగ్లాండ్ పంపించనుంది. ఇందులో ఇటీవల బ్యాటింగ్ కోచ్ గా నియమించబడిన యూనిస్ ఖాన్, స్పిన్ కోచ్ ముస్తాక్ అహ్మద్ లు కూడా వున్నారు. మరోవైపు ఈపర్యటనకు ముందు లాహోర్ లోని నేషనల్ స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ ను నిర్వహించాలనుకున్న పీసీబీ కరోనా నేపథ్యంలో దాన్ని రద్దు చేసింది. 
 
ఇదిలావుంటేప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ కోసం సాధన మొదలు పెట్టింది.మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇటీవల ఇంగ్లాండ్ చేరుకున్న విండీస్ నిన్నటి నుండి మాంచెస్టర్ లో ప్రాక్టీస్ చేస్తుంది. జులై 8నుండి సౌతాంఫ్టన్ లో మొదటి టెస్టు జరుగనుంది. ఈటెస్టు తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ పున: ప్రారంభం కానుంది. బయో సెక్యూర్ వాతారవరణం లో ప్రేక్షకులు లేకుండా ఈమ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిశాక ఇంగ్లాండ్ , పాకిస్థాన్ తో తలపడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: