అంతర్జాతీయ టి20 క్రికెట్ మ్యాచ్ లలో అత్యధికంగా 172 పరుగుల స్కోరు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ కి సొంతం. అలాగే ఓవరాల్ గా టి - 20 మ్యాచ్ లలో  అత్యధికంగా స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా 175 పరుగులతో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ఉన్నాడు. ఈ రికార్డులను అనుగుణంగా చూస్తే అతి త్వరలోనే టి - 20లో డబుల్ సెంచరీని చూడబోతున్నామని అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీ 20 మ్యాచ్ లలో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించగల సామర్ధ్యం ఉన్న క్రికెటర్ ఎవరు  అన్న ప్రశ్నకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు రోహిత్ శర్మ.

IHG


అలాగే మాజీ క్రికెటర్ అయిన మహమ్మద్ కైఫ్ కూడా ఓటు వేయడం విశేషం. ఇక ఇప్పటి వరకు రోహిత్ శర్మ 108 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడి.. 138.79 సక్సెస్ రేట్ తో ఏకంగా 2773 పరుగులు తీయడం జరిగింది. అలాగే ఈ మ్యాచుల్లో నాలుగు శతకాలు సొంతం చేసుకోగా అత్యధికంగా స్కోర్ 118 పరుగులు చేసాడు. 

 


ఇటీవల భారత అండర్-19 మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తో హలో యాప్ ద్వారా మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ టీ20 లో డబుల్ సెంచరీ గురించి సందర్భం రావడం జరిగింది. దీనితో రోహిత్ శర్మ కే అది సాధ్యం అవుతుంది అంటూ జవాబు ఇచ్చాడు. టి 20 లో సెంచరీ తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ పతాక స్థాయిలో ఉంటుందని గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా రోహిత్ శర్మ వన్డేలలో 3 డబుల్ సెంచరీలు సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: