టీమిండియా ఇప్పట్లో మైదానం లోకి అడుగుపెట్టేలా కనిపించడంలేదు. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో రిస్క్ తీసుకోవడం లేదు బీసీసీఐ. స్వదేశంలోనే కాదు విదేశాల్లో జరిగే సిరీస్ లకు కూడా నో చెప్తుంది. అందులో భాగంగా జూన్ 24నుండి ఇండియా , శ్రీలంక లో పర్యటించాల్సి వుంది. ఈపర్యటనలో మూడు వన్డేల తోపాటు టీ 20 సిరీస్ ను ఆడాల్సివుంది కానీ  ఇప్పుడు ఈ టూర్ ను రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈపర్యటన మాత్రమే కాదు జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని బీసీసీఐ తెలిపింది. ఆగస్టు లో టీమిండియా ,జింబాబ్వే తో మూడు వన్డేల సిరీస్ ను ఆడాల్సివుంది. ఆగస్టు 22న మొదటి వన్డే ప్రారంభం కావాల్సివుంది కానీ కరోనా వల్ల  ఈ సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది బీసీసీఐ. 
ఇక అలాగే పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో కాంట్రాక్టు ప్లేయర్లకు ట్రైనింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదిలావుంటే ఈఏడాది ఐపీఎల్ నిర్వహించితీరాలని బోర్డు పట్టుదలతో వుంది. అందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు అలాగే సెప్టెంబర్ -అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహణ కు సిద్ధంగా ఉన్నామని ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించాడు. మొత్తానికి ఈఏడాది ఐపీఎల్ ను మిస్ చేసుకోవడానికి  బీసీసీఐ రెడీ గా లేదని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: