ప్రస్తుతం సమకాలీన క్రికెట్లో బెస్ట్ క్రికెటర్ అని చెప్పుకునే లిస్టులో మొదటిగా చెప్పుకునే పేరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని. ఇది ఒకరిద్దరు కాదు చాలా మంది ప్రముఖులు చెప్పిన మాటలు. ఇకపోతే గత మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంతో ప్రపంచ దేశాల్లో క్రికెట్ పూర్తిగా స్తంభించిన సంగతి అందరికీ విదితమే. ఇక త్వరలోనే మళ్లీ క్రికెట్ పోటీలు ఆరంభంకానున్నాయి. 

IHG': <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAHUL DRAVID' target='_blank' title='rahul dravid-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rahul dravid</a> weights in on Matthew Wade's ...


అయితే తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ ముస్తాక్ విరాట్ కోహ్లీ ని ఉద్దేశించి అతడు ఒక్కడు కాదని టీమ్ లోని 11 మందితో సమానం అని తెలిపాడు. ఇకపోతే 2019 ప్రపంచకప్ వరకు ఇంగ్లాండ్ టీం కు స్పిన్ సలహాదారుడిగా ముస్తాక్ బాధ్యతలను చేపట్టారు. ఇకపోతే తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్లో సక్లైన్ ముష్తాఖ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలంటే టీం మొత్తానికి బౌలింగ్ చేసినట్లేనని ఆయన తెలిపాడు.

 

IHG


ఇకపోతే తాను స్పిన్ సలహాదారుడిగా పనిచేస్తున్న సమయంలో బౌలర్ స్పష్టమైన దృక్పథం కలిగి ఉండాలని... నీ ఎదురుగా ఎటువంటి అద్భుత ఆటగాడు కలిగి ఉన్నా సరే స్పిన్ బౌలర్ ను అలవోకగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో బౌలర్ పై ఒత్తిడి ఉండదు. నిజానికి అలాంటి సమయంలో అందరూ చూపు కేవలం బ్యాట్స్మెన్ వైపే ఉంటుందని ఇంగ్లాండ్ స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ లకు చెప్పేవాడిని ఆయన చెప్పుకొచ్చాడు. అంకితభావం, ప్రణాళిక బంతి మీద పెడితే బౌలరు బ్యాట్స్మెన్ కంటే తక్కువ కాదని తెలియజేశాడు. నిజానికి అలాంటి మానసిక దృక్పథంతోనే విరాట్ కోహ్లీ అవుట్ చేసేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్ళని ముస్తాక్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: