టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఇండియా టీం కు ప్రపంచ ఛాంపియన్ గా గెలిచే సత్తా ఉందని, తీవ్ర ఒత్తిడిలో పరిస్థితులు ఎదుర్కొనే మానసిక ధైర్యం కొద్దిగా భారత ఆటగాళ్లకు లేదని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ టోర్నీలో చాంపియన్ లుగా నిరూపించుకుంటూనే తప్ప తమని తాము బలమైన టీంగా నిరూపించుకునే పరిస్థితి లేదని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు కేవలం టీమిండియా 1983, 2011 లో మాత్రమే గెలిచిందని చెప్పుకొచ్చారు.

IHG's 151 guides <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DELHI' target='_blank' title='delhi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>delhi</a> to ...

నాలుగు సార్లు సెమీఫైనల్ దాకా వెళ్లి ఓడిపోవడం జరిగిందని… జట్టులో ఆడే ప్రతి ఆటగాడు ప్రత్యేకంగా మంచి ఆటగాడిగా అనిపించుకో అక్కర్లేదు కానీ జట్టుకి చాలా మంచి ఆటగాడిగా నిరూపించుకోవాలని, ఒత్తిడిలో కూడా జట్టును ముందుకు నడిపించాలని సూచించారు. కొన్నిసార్లు తాను ఆడుతున్న టైంలో ఒత్తిడిని ఎదుర్కోలేక పోయా అని భావిస్తున్నట్లు కూడా ఒప్పుకొన్నారు. టోర్నీలో సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్స్ దాకా జట్టు వెళ్లిందంటే లీగ్‌ స్టేజీ ల్లో బాగా ఆడారని, ఒత్తిడిని జయిం చారని అర్థం అవుతుందన్నారు.

IHG

ఇక సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్ నాకౌట్ దశలో టీం సరిగ్గా ఆడలేదు అంటే ఆ జట్టు మానసికంగా దృఢంగా లేదని భావించాల్సి ఉంటుందని తెలిపాడు. ప్రజెంట్ ఇండియా టీం కి వరల్డ్ ఛాంపియన్ గా నిలిచే సత్తా ఉందని, మైదానంలో నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైందని గౌతం గంభీర్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కొన్ని సూచనలు మరియు జాగ్రత్తలు కూడా ప్రస్తుతం ఉన్న భారత్ జట్టు సభ్యులకు గౌతమ్ గంభీర్ తెలియజేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: