ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు -సెప్టెంబర్ లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ 20లు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం జూన్ 23-26 మధ్యలో పాక్ జట్టు ఇంగ్లాండ్ లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ లో కరోనా విజృంభిస్తుంది. పలువురు క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారు అందులో భాగంగా మాజీ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి మూడు రోజుల క్రితం కరోనా సోకింది. ప్రస్తుతం ఆఫ్రిది చికిత్స తీసుకుంటున్నాడు. 
 
ఇంతకుముందు మాజీ ఆటగాడు తౌఫిక్ ఉమర్,  ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్ కు పాక్ ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి అయితే ఇమ్రాన్ ఖాన్  మాత్రం పాక్ జట్టు, ఇంగ్లాండ్ కు వెళ్లేందుకు అనుమతించారు. యూకే ప్రభుత్వం నిబంధల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు 14రోజుల పాటు క్వారెంటైన్ లో ఉండాలి. ఇక ఈపర్యటన కు ఇటీవల 29మంది ఆటగాళ్లతో కూడిన జట్టు ను ప్రకటించింది పీసీబీ. పాక్ టెస్టు జట్టు కు అజార్ అలీ టీ 20లకు బాబర్ అజామ్ లు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. బయో సెక్యూర్ వాతావరణం లో ఈ సిరీస్ జరుగనుంది. 
 
ఇదిలావుంటే ఈ సిరీస్ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో తలపడనుంది. మొత్తం మూడు టెస్టులు జరుగనుండగా జులై 8నుండి సౌతాంఫ్టన్ లో మొదటి టెస్టు జరుగనుంది. ఈటెస్టు తో అంతర్జాతీయ క్రికెట్ పున: ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: