ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్ విడుదల చేసేందుకు మార్గం లభించిందనే చెప్పాలి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కావాల్సిన టి20 వరల్డ్ కప్ కి తాము సరైన ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ ఇండైరెక్ట్ గా తెలియజేయడం జరిగింది. దీనితో టి20 వరల్డ్ కప్ ఖచ్చితంగా వాయిదా పడటం అన్న మాటలు ఎటువంటి సందేహం లేదు. ఇక అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో ఐపీఎల్ 2020 సీజన్ జరగటం ఖచ్చితం అని అర్థమవుతుంది.  నిజానికి మే నెలలోనే టి20 వరల్డ్ కప్ వాయిదాపై ఐసీసీ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ వరకు పర్యాటక వీసాలపై నిషేధం విధించడంతో... ఆ దేశంలోకి 16 దేశాల క్రికెట్ జట్టు సభ్యులను అనుమతించడం లేదు.

 

 

దీనితోపాటు అనంతరం 14 రోజుల క్వారంటైన్ కూడా సాధ్యం కానిది అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు తెలియజేయడం జరిగింది. దీనితో ఈ ఏడాది జరగాల్సిన టి20 వరల్డ్ కప్ ని 2022 కి వాయిదా వేయాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తమకి 2021 లో ఇండియాలో  జరగబోయే టి20 వరల్డ్ కప్ ఆదిత్య హక్కులు కావాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చివర్లో తెలియజేయడం జరిగింది. దీనితో టోర్నీ వాయిదా నిర్ణయం తీసుకోవడం ఐసీసీ పక్కన పెట్టడం జరిగింది. 

 


ఇక టి20 వరల్డ్ కప్ ఆతిథ్యం పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ మాట్లాడుతూ ఈ సంవత్సరం టి20 ప్రపంచ కప్ అధికారికంగా రద్దు లేదా వాయిదా పడలేదు... అయితే టోర్నీలో పాల్గొనాల్సిన 16 దేశాల క్రికెట్ జట్లు కావడంపై అవకాశాలన్నీ పరిశీలిస్తున్నాం. కానీ, వాటిలో కొన్ని దేశాలలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండంగా... కనుక ఆ దేశాల క్రికెట్ జట్టును దేశంలోకి అనుమతించడం కుదరదు. నా అంచనాల ప్రకారం ఈ సంవత్సరం టి20 వరల్డ్ కప్ జరగటం చాలా చాలా కష్టం అంటూ ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: