ఐపీఎల్ 2020 సీజన్ కు బీసీసీఐ ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా దేశంలో అక్టోబర్ 18 నవంబర్ 15 వరకు జరగాల్సిన టి-20 ప్రపంచకప్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడడం దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో విదేశీ ఆటగాళ్లను భారత్ కు రప్పించి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ పక్కాగా ప్లాన్ చేపడుతోంది. ఈ మేరకు ఓ షెడ్యూల్ కూడా బీసీసీఐ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆదిత్య వేదికలపై పూర్తిగా కసరత్తులు చేస్తున్నట్లు కూడా అర్థం అవుతోంది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దయినట్లు అయితే రూ. 4000 కోట్ల వరకు నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 

 

ఇకపోతే ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం... ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వ తారీకు వరకు ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లను నిర్వహించేందుకు bcci పెద్దలు నిర్ణయించినట్లు అర్థమవుతోంది. ఇక స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించబోమని ఇప్పటికే ప్రకటించింది. దీనికి కారణం ప్రస్తుతం దేశంలో కరోనా ఏవిధంగా ఎక్కువ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంతో bcci వేదికల పై మాత్రం కాస్త కసరత్తు గట్టిగానే చేస్తుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు హోటల్స్ దగ్గరగా ఉన్న స్టేడియాల జాబితాను పూర్తిగా పరిశీలన చేస్తోంది. 

 

 

ఇకపోతే ఐపీఎల్ టోర్నీలో ప్రతిసారి ఒక టీం సొంత గడ్డలో ఏడు మ్యాచ్ల ఆడనుండగా మిగతా ఏడు మ్యాచులు ఆయా టీం ల సొంతగడ్డపై ఆడాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర, తమిళనాడు లాంటి కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో మ్యాచ్ లు నిర్వహించకపోడం మంచిది అని ఇప్పటికే ఆలోచన చేస్తుంది. సెప్టెంబర్ నెలలో ఉత్తరాదిన అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున దక్షిణ రాష్ట్రాలలో మ్యాచ్ల కోసం అనువైన వేదికలని బిసిసిఐ ఆలోచిస్తుంది. అంతేకాదు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్స్ ను ఏర్పాటు చేసేందుకు బిసిసిఐ యత్నాలు చేస్తుంది. అయితే ఇవన్నీ టి20 వరల్డ్ కప్ వాయిదా పడితేనే ఇవన్నీ bcci పూర్తిస్థాయిలో నిర్వహించడానికి వీలుగా ఉంటుంది. ఐసీసీ వరల్డ్ కప్ తుది నిర్ణయం తర్వాత నే ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్ ప్రకటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: