ప్రతి వేసవి కాలంలో ఇండియా లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆస్వాదించే ఐపీఎల్ టోర్నీ ఈసారి కచ్చితంగా ఈ సీజన్ ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికోసం ఆల్రెడీ ఇప్పుడు షెడ్యూల్ కూడా బీసీసీఐ ప్రిపేర్ చేసినట్లు వచ్చే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ ఐపీఎల్ 2020 టోర్నీ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ ఒక షెడ్యూల్ ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో...ఈ పరిస్థితి సెప్టెంబర్ లో ఉండే అవకాశం లేదని భావిస్తూ బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఇక్కడ తిరకాసు ఏమిటంటే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందట. అంతే కాకుండా హోటల్స్ కి మరియు గ్రౌండ్ కి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉండే స్టేడియాలు లోనే ఈ మ్యాచ్ లో నిర్వహించాలని అనుకుంటుందట. బీసీసీఐ… ఇప్పటికే కొన్ని స్టేడియాలు ను సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఎక్కువగా బెంగ‌ళూరు, చెన్నై, ముంబై న‌గ‌రాల్లో టోర్నీ మొత్తం ముగిసే అవ‌కాశం ఉంద‌ని టాక్.

 

బెంగళూరులో పరిస్థితి బానే ఉన్న చెన్నై మరియు ముంబై నగరాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో… ఈ విషయంలో బీసీసీఐ కొద్దిగా ఆలోచిస్తున్నట్లు, సెప్టెంబర్ టైం కల్లా వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క అక్టోబ‌ర్ 18 నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ఆ టోర్నీపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో బీసీసీఐ సెప్టెంబర్ నుంచి ఐపీఎల్ నిర్వహించాలని భావించడం అందరిని కన్ఫ్యూజన్ చేస్తోంది. ఒకవేళ టీ20 వ‌ర‌ల్డ్  క్యాన్సిల్ అయ్యి ఐపీఎల్ జరిగితే మాత్రం ఇది క్రికెట్ అభిమానులకు ఎగిరి గంతేసే  వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: