భారత మాజీ టీమిండియా కెప్టెన్, ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ తన మొదటి సెంచరీని 1996 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున చేశారు. అది కూడా ఇంగ్లాండ్ దేశంలోని పేరుమోసిన లార్డ్స్ మైదానంలో. లార్డ్స్ మైదానంలో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ సెంచరీ చేసిన వ్యక్తిగా సౌరవ్ గంగూలి మూడో వ్యక్తిగా పేరుపొందాడు. అయితే లార్డ్స్ మైదానంలో అరంగ్రేటం లోనే అత్యధిక పరుగుల రికార్డు 131 పరుగులు ఇంకా సౌరబ్ గంగూలీ పేరు మీద కొనసాగుతేనే ఉంది.

 

 


సౌరవ్ గంగూలీ క్రికెట్ ఆరంగ్రేటం విషయానికి వస్తే...1992 సంవత్సరం లో వెస్ట్ఇండీస్ జట్టుపై తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే కొన్ని కారణాలతో ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయాడు. కాని 1992 తర్వాత రంజీ మ్యాచ్ లో అత్యధిక పరుగులు సాధించడంతో మళ్లీ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకోవడంతో 1996లో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో సౌరబ్ గంగూలీ మళ్లీ తిరిగి అడుగు పెట్టారు. అయితే లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ సాధించాడు.

 


ఇకపోతే ఈ మ్యాచ్ గురించి సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నేడు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు నా మొదటి సెంచరీ చేసిన రోజు, నా జీవితంలో మర్చిపోలేని గొప్ప సంగతి అని ట్విట్టర్ వేదిక ద్వారా ఆనాటి మ్యాచ్ ఫోటోలను సౌరబ్ గంగూలీ పోస్ట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: