కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం క్రీడలు స్తంభించిన సంగతి అందరికీ విదితమే. అసలు విషయంలోకి వెళ్తే.. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు నుండి క్రికెట్ పోటీలు ఆగిన దగ్గర నుండి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ కం ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని రెచ్చిపోయాడు. తనకు వచ్చిన డాన్స్ తో టిక్ టాక్ వీడియోల ద్వారా అదరగొడుతున్నాడు. వినుతున్న ఆలోచనలతో సరదా వీడియోలు చేస్తూ వాటిని ఇంస్టాగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ ఖాతా ద్వారా తన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఫుల్ గా ఖుషి చేస్తున్నాడు.

 

 

ముఖ్యంగా ఆయన చేసిన రాములో రాముల పాటకు, అలాగే బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేసి తెలుగు అభిమానులను సప్రైజ్ చేశాడు. ప్రస్తుత వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాడో ఆయన తాజాగా ఒక వివరణ ఇచ్చాడు. ప్రజల ముఖాలపై నవ్వు తెచ్చేందుకు ఇలా చేస్తున్నానని తాను చెప్పుకొచ్చాడు. ప్రజల్లో పేదల మీద నవ్వు చూడటానికి తాను, తన కుటుంబం చేయాల్సిందంతా చేశామని తెలియజేశాడు.

 

సినిమా ఇండస్ట్రీ అయినా సరే వాటిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అందులో వీలైనంత అన్నీ చేశాను. ముఖ్యంగా మాకు చాలా ప్రజల నుండి అనేక రిక్వెస్ట్ లు వచ్చాయి, అభిమానుల కోరిక మేరకే మొదట బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశామని ఆయన తెలిపారు. దీనితో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఆయనకు అనేక మెసేజ్లు వచ్చాయి అని తెలుపుతూ... అందులో మేము మాకు వీలైనన్ని చేశామని తెలియజేశాడు. ఇలా చేయడం మాకు చాలా సరదాగా ఉందని తెలియజేస్తూ... అలాగే వాటిని బాగా ఆస్వాదించామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: