ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో అఫ్గాన్ వికెట్​ కీపర్ అఫ్జర్ జజాయ్, చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అఫ్గానిస్థాన్ వికెట్​కీపర్​ అఫ్జర్ జజాయ్​కు ప్రమాదం తప్పింది. వేరొక వాహనాన్ని ఢీకొని, అతడి కారు ముందు భాగం నుజ్జునుజ్జ అయింది. ఈ ఘటనలో జజాయ్​​ తలకు చిన్నగాయమే కావడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. జర్నలిస్ట్, అఫ్గానిస్థాన్ మాజీ మీడియా మేనేజర్​ ఇబ్రహీం మహ్మద్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సంబంధిత ఫొటోల్ని పంచుకున్నారు. 

 

 


జజాయ్.. అఫ్గాన్ తరఫున 17 వన్డేలు, ఓ టెస్టు, టీ20​ ఆడాడు. 2013లో అరంగేట్రం చేసిన ఈ వికెట్​ కీపర్​.. గతేడాది వెస్టిండీస్​తో జరిగిన వన్డేలో చివరగా కనిపించాడు. స్టార్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్,​ జట్టులో ఉండటం వల్ల ఇతడికి ఆడే అవకాశం ఎక్కువగా రాలేదు. ఈ ప్రమాదం గురించి అతను ట్విట్టర్లో చేసిన పోస్ట్ హల్ చల్ చేసింది. దీనికి అన్ని రంగాలలో ఉన్న ప్రముఖులు ఆయా దేశాల్లో ఉన్న క్రికెటర్లు క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ వార్తలు వాట్ స్థాయికి మించి పనులు చేస్తుంటాయి. ప్రమాదానికి గురైన కారు ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తుంది. అది నుజ్జు నుజ్జు అయ్యి కారు తీరు మొత్తం మారిపోయింది.

 


తన క్షేమ సమాచారం కోసం క్రికెటర్ లందరూ ఫోన్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా ఎందరో అభిమానులు తన క్షేమ సమాచారం కోసం మెసేజ్ చేశారు... ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటోలు తన తల మీద గాయాలైనట్లు, రక్తస్రావంతో ఉన్నా అతనికి తలకట్టు కట్టినట్లుగా ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఇలాంటి మహమ్మారి కరోనా వచ్చినప్పుడు క్రీడలు అన్ని  ఆగిపోయిన సమయంలో ఈ విధంగా ఆటగాళ్లకు దెబ్బలు తగలడం స్పాన్సర్ లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: