వారం రోజుల క్రితం గాల్వన్ లోయలో చైనా భారతదేశం సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలకు ఆ తర్వాత దేశమంతట చైనా దేశానికి సంబంధించిన వ్యతిరేక వాతావరణం. ఇకపోతే కొన్ని రంగాలకు చెందిన ప్రముఖులు భారత సైనికుల శక్తి పాటవాలను కొనియాడుతూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా కూడా సైనికుల త్యాగాలను కొనియాడి చైనా దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 


అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ తను ఆర్మీ మీ కుటుంబానికి చెందిన వాడని అందుకే నాకు సైనికుడి కష్టనష్టాలు తెలుసునని తెలియజేశాడు. సైనికుల జీవితం అంటే అంత ఆషామాషీ కాదని తనకు తెలుసునని దాని కారణంగానే నేను చైనా ఉత్పత్తులు పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు సురేష్ రైనా. 

 


ఆర్మీ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ సురేష్ రైనా నిజంగా మొన్న జరిగిన కాల్పుల్లో 20 మంది ఆర్మీ సైనికులను కోల్పోవడం నిరాశపరిచింది అని తెలియజేశాడు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను అంటూ ఆయన తెలియజేశాడు. వీలైనంత వరకు అమరవీరుల కుటుంబానికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేశాడు. ఇకపోతే మరోవైపు ఐపీఎల్ స్పాన్సర్షిప్ కలిగిన వివో కంపెనీ ఫై నిర్ణయం చేసేందుకు ఐపీఎల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదిక ద్వారా ఐపీఎల్ కమిటీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: