ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగకపోవడంతో ఇంటికి పరిమితం అయిన  చాలా మంది క్రికెటర్లు మాజీ క్రికెటర్లు తమ క్రికెట్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రస్తుత మాజీ క్రికెటర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. అయితే తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్  ప్లంకెట్ తన అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టే మ్యాచ్ కి ముందు ఎదురైనా  ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం గురించి గతంలోనూ  చెప్పినప్పటికీ తాజాగా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేయడానికి ముందు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ తనను చంపుతానని బెదిరించాడు అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ ప్లంకెట్. 

 

 

 2005లో జరిగిన మ్యాచ్ కి సంబంధించిన సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం పాకిస్తాన్తో లోహర్  లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాను  అంటూ తెలిపారు లియామ్ ప్లంకెట్. కానీ తాను అంతర్జాతీయ క్రికెట్ లోకి  అరంగేట్రం చేసే తొలి మ్యాచ్ కి ముందే కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నాను అంటూ  తెలిపాడు. తాను రనప్  చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తనను చంపేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ తెలిపాడు. అయితే షోయబ్ అక్తర్  అలా  ప్రవర్తించడం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. 

 


 తామిద్దరం కలిసి కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న క్రమంలో అక్తర్  ఇలా ఎందుకు ప్రవర్తించాడు అన్నది మాత్రం తనకు ఎంత ఆలోచించినా అంతు బట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లియాజ్ ప్లంకెట్. అప్పటికే అక్తర్  96.97 మైళ్ల వేగంతో బౌలింగ్  చేస్తున్నాడు అన్నది అర్థం చేసుకున్నాను, ఇక తర్వాత మైదానంలోకి బ్యాట్ పట్టుకొని దిగిన తర్వాత అక్తర్ బౌలింగ్ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అనుకున్నాను.  కానీ ఇంతలో  ఒక బంతి భుజానికి తాకింది.  అయినప్పటికీ భయపడకుండా క్రీజ్లో పాతుకుపోవనికి సిద్ధమై  51 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేశాను  అంటూ చెప్పుకొచ్చాడు ప్లంకెట్.

మరింత సమాచారం తెలుసుకోండి: