కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఏవిధంగా ఇబ్బంది పెడుతున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ప్రభావం చాలా రంగాలపై పడింది. అనేక మంది వారి ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక ఇదే తరుణంలో క్రీడారంగం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా క్రీడలను పూర్తిగా రద్దు చేసిన సంగతి విదితమే. అయితే ఈ సమయంలో ఆటగాళ్లు వాళ్ళందరూ వారి కుటుంబాలతో పూర్తి సమయాన్ని సంతోషంగా గడిపేశారు. ఇక అలాగే తాజాగా క్రీడా రంగంలో పరిస్థితి మార్పు చోటు చేసుకుంటుంది.

 

 

తాజాగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లను కొనసాగింపే దిశగా క్రీడారంగం అడుగులు వేస్తోంది. ఇకపోతే తాజాగా టీమిండియా బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా  మూడు నెలల తర్వాత మళ్లీ బ్యాట్ ను పట్టాడు. మార్చి నెలలో సౌరాష్ట్ర రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ లాడిన పూజార ఆ తర్వాత మళ్లీ కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా మళ్లీ సౌరాష్ట్రలోని  ఓ అకాడమీలో పూజారా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తాను ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టేముందు ప్యాడ్స్ ను ధరించిస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు చతేశ్వర్ పుజారా . ఆ సమయంలో క్రికెట్ ఆడి ఎన్నో రోజులు కలిగిన ఫీలింగ్ వచ్చిందని... కానీ, ఒక్కసారి బ్యాటింగ్ పొజిషన్ తీసుకునే సరికి నిన్ననే ఆడినట్లు అనిపిస్తుందని తెలియజేశాడు. ఇకపోతే ఆ దేశంలో ప్రాక్టీస్ కు జయదేవ్ ఉనద్కత్, సౌరాష్ట్ర బ్యాట్స్మెన్ అర్పిత్ కూడా హాజరయ్యారు.

 


ఇకపోతే ప్రస్తుతం కేవలం టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే ఆడుతున్న చతేశ్వర్ పుజారా  టీమిండియా ఈ సంవత్సరంలో చివరలో ఆస్ట్రేలియా సిరిస్ ఆడబోతున్నాడు. ఇక ఈ మేరకు పూజారా ఇప్పటి నుంచే తన ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టు అర్థమవుతోంది. అలాగే మూడు నెలలకు క్రికెట్ కు దూరంగా ఉన్నా ఆటగాళ్లందరూ మళ్లీ గాడిన పడాలంటే కచ్చితంగా నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని కోచ్ లు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: